బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చాలా రోజుల తర్వాత ఓ మంచి సాలిడ్ హిట్‌ను అందుకున్నాడు. ఆయన నటించిన టైగర్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదలైన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇప్పటివరకు రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దేశమంతా ప్రపంచ కప్ ఫీవర్ నడుస్తోంది కాబట్టి గత రెండు రోజులుగా కలెక్షన్లు తగ్గు ముఖం పట్టాయి. ఫైనల్ తర్వాత మళ్లీ టైగర్ విజృంభించే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే టైగర్ 3 మూవీ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. అదే ఈ హై యాక్షన్ స్పై థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్. అదేంటి.. మొన్ననే కదా థియేటర్లలో టైగర్ 3 విడుదలైంది. అప్పుడే ఓటీటీలోకి ఏంటా? అని ఆలోచిస్తున్నారా? అయితే అసలు విషయంలోకి వెళదాం రండి. టైగర్ 3 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సల్మాన్ కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే థియేట్రికల్ రన్ పూర్తిగా ముగిసిన తర్వాతనే అంటే డిసెంబర్ మూడో వారంలో సల్మాన్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారట. లేకపోతే క్రిస్మస్ పండగ కానుకగా టైగర్ 3 ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసురావొచ్చనే టాక్ వినిపిస్తోంది.
మనీష్ శర్మ దర్శకత్వం వహించిన టైగర్ 3 సినిమాలో సల్మాన్ ఖాన్ కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. సీరియల్ కిస్సింగ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా మెప్పించాడు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో అలరించారు. . ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ స్పై థ్రిల్లర్‌ను నిర్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..