సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న తర్వాత తేజ్ చేసిన మొదటి సినిమా ఇదే. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇటీవలే రూ.100 కోట్ల క్లబ్ లిస్టులో కూడా చేరింది. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న విరూపాక్ష సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. తేజ్ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం శనివారం (మే 20) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది విరూపాక్ష. దీంతో చాలామంది ఫ్యాన్స్ ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
విరూపాక్ష సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. కాంతారా ఫేం అజనీశ్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చారు. కాగా విరూపాక్ష సినిమాను హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, రవి కృష్ణ, సోనియా, అభినవ్ గోమఠం, కమల్ కామరాజు, సాయి చంద్, అజయ్, చత్రఫతి శేఖర్, యాంకర్ శ్యామల తదితరలు ప్రధాన పాత్రల్లో నటించారు. మరి థియేటర్లలో విరూపాక్షను మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
#Virupaksha is Now Streaming On @NetflixIndia #BlockbusterVirupaksha pic.twitter.com/iBnJcvYZbs
— Trends SaiDharamTej™ (@TrendsForSDT) May 21, 2023
Just watched #Virupaksha on @netflix
WOW: an amazing movie !@IamSaiDharamTej & @iamsamyuktha_ shine !
Kudos to @karthikdandu86 & @SukumarWritings for so powerfully showcasing #India‘s ancient #Tantric traditions
Proud to be #Indian
Ultimately, #love trumps #vengeance pic.twitter.com/Sfe85rGt7Y
— Navi Radjou ???????(நவி ராஜூ) (@NaviRadjou) May 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.