Republic Movie: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన సాయి ధరమ్‌తేజ్‌ రిపబ్లిక్‌.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

|

Nov 02, 2021 | 10:25 AM

Republic Movie: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రం రిపబ్లిక్‌. అక్టోబర్‌ 1న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు దేవకట్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో..

Republic Movie: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన సాయి ధరమ్‌తేజ్‌ రిపబ్లిక్‌.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..
Republic Moive Ott
Follow us on

Republic Movie: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రం రిపబ్లిక్‌. అక్టోబర్‌ 1న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు దేవకట్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ్‌ ఐఎస్‌ అధికారిగా నటించి మెప్పించారు. ఇక ఇందులో తేజ్‌కు జోడిగా ఐశ్వర్య రాజేశ్‌ నటించిన విషయం తెలిసిందే. సమకాలీన అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందులోనూ ఈ సినిమా విడుదలకు ముందు తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురికావడం, సినిమా ప్రచారాన్ని మొత్తం పవన్‌ కళ్యాణ్ తన భుజాన వేసుకోవడంతో సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది.

ఇదిలా ఉంటే మేకర్స్‌ ఈ సినిమాను తాజాగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులను జీ5 సంస్థ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన కేవలం 50 రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రిపబ్లిక్‌ చిత్రాన్ని ఈ నెల 26న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే గత వినాయక చవితి రోజున బైక్‌ ప్రమాదానికి గురైన సాయి ధరమ్‌ తేజ్‌ నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తేజ్‌ తాజాగా ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Also Read: విశాఖలో మరో కొత్త పర్యాటక ప్రాంతం.. వ్యూ పాయింట్ వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు.. వీడియో

Huzurabad By Election Result: హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం.. తొలి రౌండ్‌లో ఎన్ని ఓట్లు వచ్చాయంటే..

Arvind Kejrival: మమ్మల్ని గెలిపిస్తే ఉచితంగా తీర్థయాత్రలు.. గోవా ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్‌ హామీ..