నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఇటీవల అఖండ సినిమాతో థియేటర్లలో రికార్డ్స్ సృష్టించిన బాలయ్య.. ఇటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ద్వారా సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు బాలకృష్ణ. ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ చిట్‌ఛాట్ షో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ షోలో మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక త్వరలోనే మహేష్ బాబు ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాలయ్య షోలో సందడి చేయడానికి మాస్ మహారాజ రవితేజ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని రాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. రవితేజ, గోపిచంద్ మలినేనికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 24న టెలికాస్ట్ కానున్నట్లుగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రం డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
ట్వీట్..
#UnstoppableWithNBK is getting a MASS makeover. ??
The God of Masses #NandamuriBalakrishna is joined by our Mass Maharaja @RaviTeja_offl and director @megopichand.
Let’s get KRACKed.
Episode 6 premieres Decemeber 24. pic.twitter.com/FVfMPl9oQb
— ahavideoIN (@ahavideoIN) December 19, 2021
Bigg Boss 5 Telugu Ep.105: సందడిగా 5వ సీజన్ ఫైనల్ డే.. హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్..
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?