మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ముచ్చటగా తెరకెక్కిన మూడో సినిమా మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. సాంగ్స్, పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన మిస్టర్ బచ్చన్ అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి ఆట నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు పోటీగా ఇస్మార్ట్ శంకర్, ఆయ్ వంటి సినిమాలు బరిలో ఉండడంతో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఎప్పటిలాగే రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. అలాగే కొత్త హీరోయిన్, భాగ్యశ్రీ భోర్సే అందాలు, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ మిస్టర్ బచ్చన్ సినిమాను కొంతలో కొంత నిలబెట్టాయని చెప్పవచ్చు. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మిస్టర్ బచ్చన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 12 నుంచే రవితేజ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్.
‘సరిహద్దుని కాపాడే సైనికులను చూసి ఉంటారు.. సంపదను కాపాడే సైనికుడిని ఇప్పుడు చూస్తాను. సెప్టెంబర్ 12 నుంచి మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ కు రానుంది’ అంటూ నెట్ ఫ్లిక్స్ మిస్టర్ బచ్చన్ పోస్టర్ ను పంచుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రవితేజ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మించారు. జగపతి బాబు విలన్ గా నటించారు. అలాగే కమెడియన్ సత్య, ప్రవీణ్, ఝూన్సీ, సచిన్ ఖేడ్కర్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. మిక్కీజే మేయర్ అందించిన మాస్ పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.
Sarihaddhu ni kaapade sainikuduni choosuntaru, sampadha ni kaapade sainikuduni ippudu choostharu. #MrBachchan is coming to Netflix on 12 September in Tamil, Telugu, Malayalam and Kannada! #MrBachchanOnNetflix pic.twitter.com/mlCoioO0vS
— Netflix India South (@Netflix_INSouth) September 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..