Sapta Sagaralu Daati Side B: ఓటీటీలోకి అందమైన ప్రేమకథ.. ‘సప్త సాగరాలు దాటి సైడ్ బీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ సప్త సాగరాలు దాటి సైడ్ బీ మూవీని సైతం రిలీజ్ చేశారు. కన్నడ, తెలుగులో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. థియేటర్లలలో సక్సెస్ అయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. నిజానికి ఈ మూవీ డిసెంబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని టాక్ నడిచింది. కానీ రిలీజ్ కాలేదు.
777 చార్లీ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఈ మూవీలో ఆయన నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ సప్త సాగరాలు దాటి సైడ్ బీ మూవీని సైతం రిలీజ్ చేశారు. కన్నడ, తెలుగులో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. థియేటర్లలలో సక్సెస్ అయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. నిజానికి ఈ మూవీ డిసెంబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని టాక్ నడిచింది. కానీ రిలీజ్ కాలేదు. గతంలో ఫస్ట్ పార్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సైతం అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీగోగా నటించగా.. రుక్మిణి వసంత్ కథానాయికగా కనిపించింది. ఈ చిత్రానికి హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహించగా.. చరణ్ రాజ్ సంగీతం అందించారు. కన్నడలో రక్షిత్ శెట్టి నిర్మించగా.. తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేసింది. కన్నడలో మంచి వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
This is my invite to all of you to experience the depths of love! 🤗 Our Sapta Sagaradaache Ello – Side B is yours from today. I hope you will come with an open heart ♥️#SSESideB #SSDSideB #EKTSideB pic.twitter.com/TEC4rwsXrC
— Rakshit Shetty (@rakshitshetty) November 17, 2023
ప్రియ ప్రేమ కోసం మను జైలుకు వెళ్లడంతో సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమా ముగుస్తుంది. ఇక ఆ తర్వాత పదేళ్ల జైలు శిక్ష అనుభవించిన మను జైలు నుంచి విడుదలై తన భార్య ప్రియ కోసం వెతకడం.. ఆమెకు తెలియకుండానే తన కలలను నెరవేర్చడం జరుగుతుంది. చివరకు వీరిద్దరు ఎలా కలుసుకున్నారనేది కథ. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Been a couple of months since I left Ooru and the country. I’ve felt at home for once, and I can say this with a full heart. Thank you for this work of art @hemanthrao11. I don’t think a movie of similar genre is going to surpass this for a while. 1/2 pic.twitter.com/PgLidfhre8
— Akshay Rao (@akshayrao19) December 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.