Narakasura OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘నరకాసుర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

|

Mar 11, 2024 | 8:08 AM

పలాస 1978 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. ఇందులో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రక్షిత్ నరకాసుర అంటూ ఒక యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు.

Narakasura OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్‌ నరకాసుర.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Narakasura Movie
Follow us on

పలాస 1978 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. ఇందులో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రక్షిత్ నరకాసుర అంటూ ఒక యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. సెబాస్టియన్ నావో అకోస్టా తెరకెక్కించిన ఈ మూవీలో అపర్ణ జనార్దన్‌, సంకీర్తన విపిన్‌ హీరోయిన్లుగా నటించారు. శత్రు, నాజర్, చరణ్ రాజ్, శ్రీమన్, తేజ్ చరణ్‍రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ తో ఆసక్తిరేకెత్తించిన నరకాసుర గతేడాది నవంబర్ 3వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అయితే సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీనికి తోడు పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లకే పరిమితమైంది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన నరకాసుర మూవీ ఇప్పుడు సడెన్‍గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

 

ఇవి కూడా చదవండి

అయితే నరకాసుర సినిమా రెంటల్ బేసిస్‍లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అంటే అమెజాన్ సబ్ స్క్రైబర్లు కూడా ఈ సినిమా చూడాలంటే రూ.79ల రెంట్ చెల్లించాలి. అయితే కొద్ది రోజుల తర్వాత ఎలాంటి రెంట్ లేకుండా ఉచితంగా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నరకాసుర సినిమాకు నాఫర్ రాజా సంగీతం అందించారు. అజ్జా శ్రీనివాస్, కురుమారు రఘు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి థియేటర్ లో నరకాసుర సినిమాను మిస్ అయ్యారా? అలాగే ఓటీటీలో ఓ మంచి యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూడాలనుకుంటున్నారా? అయితే నరకాసుర మీకు ఓ మంచి ఛాయిస్‌.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

 

నరకాసుర సినిమా ట్రైలర్..

ఆకట్టుకుంటోన్న రక్షిత్ నయా మూవీ టీజర్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి