ఓటీటీలో సినిమాలు సందడి చేయడం చాలా కామన్. థియేటర్స్ లో సందడి చేసిన సినిమాలు ఓటీటీలోకూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఓటీటీల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రేక్షకులు థియేటర్స్ కు రాలేని పరిస్థితుల్లో ఓటీటీలు వినోదాన్ని అందించాయి. చాలా సినిమాలు , వెబ్ సిరీస్ లు ఓటీటీల ద్వారా అభిమానులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల్లో ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. మరికొన్ని సినిమాలు 50 రోజులు పూర్తయిన తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇంకొన్ని సినిమాలు రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు పిజ్జా 3.
విజయ్ సేతుపతి నటించిన పిజ్జా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా హరర్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. పిజ్జా మూవీ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు తమిళ్ భాషల్లో విడుదలైన ఈ మూవీ రెండు చోట్ల మంచి సక్సెస్ ను సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా పిజ్జా 2 సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కూడా పర్లేదు అనిపించుకుంది.
ఇక ఇప్పుడు పిజ్జా 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిజ్జా 3 ది మమ్మీ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆగస్టు 18న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు వారం తిరగకుండానే ఓటీటీలో రిలీజే అయ్యింది.
Presenting A Glimpse of 𝐏𝐢𝐳𝐳𝐚𝐓𝐡𝐞𝐌𝐮𝐦𝐦𝐲 Streaming On @vasymusicoffl
A @ThirukumaranEnt @icvkumar Production https://t.co/M05Ecm5hT9#Pizza3 @Mohangovind8 @AshwinKakumanu @gauravnarayanan @Pavithrah_10 @AnupamaKumarONE @ignatiousaswin @TheSaiSatish @digitallynow
— Thirukumaran Entertainment (@ThirukumaranEnt) September 6, 2021
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో పిజ్జా 3 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ ను రాబడుతుంది.
🔔 Tamil movie #Pizza3TheMummy (2023) now streaming on Prime Video.
Available in – Tamil (Original), Telugu Kannada & Malayalam. pic.twitter.com/fQwAlnGIvl
— Ott Updates (@Ott_updates) August 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.