Bheemla Nayak: పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త.. ఒక్కరోజు ముందుగానే భీమ్లా నాయక్ రచ్చ..

|

Mar 22, 2022 | 7:55 PM

పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్ (Pawan Kalyan) అభిమానులకు గుడ్‏న్యూస్ అందించింది ఆహా (Aha). ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యామం

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త.. ఒక్కరోజు ముందుగానే భీమ్లా నాయక్  రచ్చ..
Pawan
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్ (Pawan Kalyan) అభిమానులకు గుడ్‏న్యూస్ అందించింది ఆహా (Aha). ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యామం ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీలో మార్పు జరిగింది. ఇందుకు ఒక్కరోజు ముందుగానే అంటే మార్చి 24న ఆహాలో భీమ్లా నాయక్ రచ్చ చేయనున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్‏తోపాటు.. రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటించిగా.. నిత్యామీనన్.. సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్‏గా తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. పవర్ స్టార్ యాక్షన్ సీన్లకు రికార్డులు బద్దలయ్యాయి.. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ అదే రోజున జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతుండడంతో ఒక్కరోజు ముందుగానే మార్చి 24 న స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటించింది ఆహా. ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ సూపర్ హిట్ మూవీస్.. సస్పెన్స్ వెబ్ సిరీస్ అందిస్తూ ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని అందిస్తుంది ఆహా. ఓవైపు బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ మాత్రమే కాకుండా.. టాక్ షోస్.. సింగింగ్ టాలెంట్ షోస్ నిర్వహిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Also Read: Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు  మారిపోతుంటాయంటూ..

Nagababu: నిహారిక ఇన్‏స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..

Naga Chaitanya: సోషల్ మీడియాలో నాగచైతన్య మరో మైలు రాయి.. అసలు విషయం ఏంటంటే..

Aishawarya Rajinikanth: విడాకుల తర్వాత సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోన్న ఐశ్వర్య రజినీకాంత్.. ట్విట్టర్ ఖాతాలో..