
Saina Movie On OTT: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘సైనా’ (Saina). ఈ సినిమాను ఆమోల్ గుప్త తెరకెక్కించగా.. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా టైటిల్ రోల్ పోషించింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో ముఖ్యంగా సైనా పాత్ర కోసం పరిణీతి పడిన కష్టం ప్రతి సన్నివేశంలోనూ ప్రతిబింబించింది. ఇక ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడమే కాకుండా.. పరిణితి చోప్రా దాదాపు 10 కేజీల బరువు కూడా తగ్గిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా నెటిజన్లను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ‘సైనా’ను అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది.
ఇటీవల ఇటీవల విడుదలైన జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ మాహరాజా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ క్రాక్, అల్లరి నందిలో ఆహాలో ప్రసారం అవుతున్నాయి. ఇక తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కానుండగా.. శర్వానంద్ శ్రీకారం సినిమా కూడా ఓటీటీలో అలరిస్తుంది.
ట్వీట్..
Also Read: పెళ్లైన మూడు సంవత్సరాల్లో 18 సార్లు ఇళ్లు మారిన జంట.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి.. వెంటపడి మరీ తరిమికొట్టిన పెంపుడు కుక్కలు.. వీడియో వైరల్..
షాకింగ్ న్యూస్.. గాలి ద్వారానే కరోనా వ్యాప్తి.. అధ్యాయనాల్లో బయటపడ్డ సంచలన విషయాలు..