సినీ పరిశ్రమలో నిలబడాలంటే ఎన్నో అడ్డంకులను, కష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో అటుపోట్లను తట్టుకోవాలి. టాలెంట్ ఎంత ఉన్నా అవకాశాలు రాకపోవడం.. ఆర్థికంగా ఎన్నో సమస్యలతో పోరాటం చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనసుకు నచ్చకపోయినా సరే కొన్ని సినిమాల్లో నటించాల్సి వస్తుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు కెరీర్ తొలినాళ్లలో అవమానాలు.. ఆర్థిక కష్టాలు చూసినవారే. కానీ ఇటీవల సూపర్ హిట్ అయిన పంచాయత్ వెబ్ సిరీస్ నటుడు దుర్గేశ్ కుమార్ కూడా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట. నటుడిగా నిలదొక్కుకోవడానికి.. డబ్బుల కోసం అడల్ట్ చిత్రాల్లోనూ నటించానని చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దుర్గేశ్ కుమార్ మాట్లాడుతూ..”నేను నటించకుండా ఉండలేను. నా సామర్థ్యం, నటనపై నాకు నమ్మకం ఉంది. నాకు వచ్చిన పనిని కచ్చితంగా చేస్తాను. కానీ ఇండస్ట్రీలో ఎదురయ్యే పోరాటాలకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. నటుడు కావాలంటే ముందుగా మానసికంగా, శారీరకంగా ఆర్థికంగా సంసిద్ధంగా ఉండాలి. సినీ పరిశ్రమలోకి వచ్చిన గత 11 ఏళ్లలో రెండుసార్లు డిప్రెషన్ భారీన పడ్డాను. 2016లో ముంబయికి వచ్చాను. అక్కడే కొందరు స్నేహితులు అయ్యారు. అందరం కలిసి ఇండస్ట్రీలో నిలబడాలనుకున్నాం. కానీ ఛాన్సుల కోసం ప్రతి క్యాస్టింగ్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి వాళ్ల కాళ్లమీద పడ్డాం. ఇదంతా కూడా హైవే, ఫ్రీకీ అలీ, సుల్తాన్ వంటి సినిమాల్లో నటించిన తర్వాతే జరిగింది. కెరీర్ మొదట్లో డబ్బుల కోసం అడల్ట్ సినిమాల్లో నటించాను. కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత అడిషన్స్ కు వెళ్లాలంటే ఏదోలా ఉంటుంది. పంచాయత్ సిరీస్ లో చిన్న రోల్ చేశాను. రెండున్నర గంటల్లో దీనిని షూట్ చేశారు” అంటూ చెప్పుకొచ్చాడు.
కామెడీ డ్రామాగా వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ ను దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. ఇందులో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, చందన్ రాయ్, బిశ్వపతి సర్కార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా, అశోక్ పాఠక్, సాన్వికా, రాజేష్ జైస్ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.