Oscar Awards 2024: ఆస్కార్ అవార్డుల్లో ‘ఓపెన్ హైమర్’ హవా.. ఏకంగా 7 పురస్కారాలు.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

|

Mar 11, 2024 | 2:01 PM

Oppenheimer OTT: అనుకున్నట్లు హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఓపెన్ హైమర్ అస్కార్ అవార్డుల్లోనూ సత్తాచాటింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొత్తం 13 విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ కాగా, ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ మూవీ కేటగిరిలో 'ఓపెన్‌హైమర్', 'అమెరికన్ ఫిక్షన్', 'బార్బీ', 'కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్' వంటి సూపర్ హిట్ సినిమాలు పోటీ పడ్డాయి

Oscar Awards 2024: ఆస్కార్ అవార్డుల్లో ఓపెన్ హైమర్ హవా.. ఏకంగా 7 పురస్కారాలు.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడితో సహా మొత్తం ఏడు విభాగాల్లో ఓపెన్ హైమర్ సినిమా అవార్డులు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ తో చూడొచ్చు. అయితే మార్చి 21 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది.
Follow us on

Oppenheimer OTT: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఇక్కడి డాల్బీ థియేటర్‌లో 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. అనుకున్నట్లు హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఓపెన్ హైమర్ అస్కార్ అవార్డుల్లోనూ సత్తాచాటింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొత్తం 13 విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ కాగా, ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ మూవీ కేటగిరిలో ‘ఓపెన్‌హైమర్’, ‘అమెరికన్ ఫిక్షన్’, ‘బార్బీ’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ వంటి సూపర్ హిట్ సినిమాలు పోటీ పడ్డాయి. అయితే వీటన్నిటినీ అధిగమించి క్రిస్టోఫర్ నోలెన్ ‘ఓపెన్‌హైమర్’ సినిమా బెస్ట్ మూవీగా ఆస్కార్ సొంతం చేసుకుంది. విశేషమేమిటంటే.. గతేడాది ఇదే రోజున ‘ఓపెన్‌హైమర్‌’, ‘బార్బీ’ సినిమాలు విడుదలయ్యాయి. అప్పుడు కలెక్షన్ల పరంగా బార్బీని అధిగమించిన ఓపెన్ హైమర్ ఇప్పుడు కూడా అదే సినిమాను పక్కకు నెట్టి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఓపెన్ హైమర్ మరికొన్ని విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెల్చుకుంది. ఫుల్ లిస్టు ఇదిగో..

ఆస్కార్ లో ఓపెన్ హైమర్

  • ఉత్తమ చిత్రం- ఓపెన్‌ హైమర్‌
  • బెస్డ్‌ డైరెక్టర్‌- క్రిస్టోఫర్‌ నోలన్‌
  • బెస్ట్‌ యాక్టర్‌- కిలియన్‌ మర్ఫీ
  • బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌- రాబర్ట్‌ డౌనీ జూనియర్‌
  • బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌- వాట్‌ వాజ్‌ ఐ మేడ్‌ ఫర్‌
  • బెస్ట్‌ సినిమాటోగ్రఫీ- ఓపెన్‌ హైమర్‌
  • బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌- జెన్నిఫర్‌ లేమ్‌

అణుబాంబును క‌నిపెట్ట‌డంలో ఓపెన్‌హైమర్ ఎదుర్కొన్న మానసిక సంఘ‌ర్ష‌ణ‌, అత‌నికి ఎదురైన ఒత్తిడుల‌ను ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులోనూ ఉంది.  అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటర్ బేసిస్ లో కూడా ఈ సినిమాను వీక్షించే అవకాశముంది. త్వరలోనే మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మార్చి 21 నుంచి ఓపెన్ హైమర్ ను వీక్షించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఏడు విభాగాల్లో పురస్కారాలు..

ఆస్కార్ వేదికపై ఓపెన్ హైమర్ చిత్ర బృందం..

ఓటీటీలో ఓపెన్ హైమర్..