Oscar 2023-Kartiki Gonsalves: ఆ సంఘటనే ఆమెను ఆస్కార్ వేదికపై నిలబెట్టింది.. 45 నిమిషాల సినిమా కోసం 450 గంటల ఫుటేజీ.. 18 నెలల కష్టం..
రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన దంపతుల మధ్య సాగే కథ. కేవలం 45 నిమిషాల నిడివి గల ఈ సినిమా కోసం 450 గంటల ఫుటేజీని చిత్రీకరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించి.

లాస్ ఏంజిల్స్ వేదికగా 95వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రపంచం మొత్తం కళ్లలో వత్తులేసుకోని ఎదురుచూసిన వేడుకలలో మొదటిసారి రెండు ఆస్కార్ అవార్డ్స్ కైవసం చేసుకుంది. ముందుగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మనదేశం నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటరిగిలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. అయితే ఎలాంటి హడావిడి లేకుండానే ఆస్కార్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించింది ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఈ సందర్భంగా దర్శకురాలు కార్తికి గోన్ సాల్వెన్, నిర్మాత గునీత్ మోగ్న భారత్ సంప్రదాయ చీరకట్టులో విశ్వవేదికపై ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. తమ శ్రమను గుర్తించి.. ప్రతిష్టాత్మక అవార్డును అందించిన అకాడమీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ కథ..
రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన దంపతుల మధ్య సాగే కథ. కేవలం 45 నిమిషాల నిడివి గల ఈ సినిమా కోసం 450 గంటల ఫుటేజీని చిత్రీకరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించి.. ఈరోజు ఆస్కార్ వేదికపై అవార్డ్ అందుకున్నారు డైరెక్టర్ కార్తికి గోన్ సాల్వెన్. ఈ క్రమంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కథకు ఆరంభం.. జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన..
కార్తికి ప్రకృతి ప్రేమికురాలు. అలాగే ఆమెకు ఫోటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం. ఫోటోగ్రాఫర్ కావాలనే లక్ష్యంతో విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ, ఫోటోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్ లో పీజీ చేసింది. కార్తికి తండ్రి ఫోటోగ్రాఫర్. తల్లికి మూగజీవులంటే ఇష్టం. బామ్మ పర్వావరణ ప్రేమిరాకురాలు. అయిదేళ్ల క్రితం కార్తికి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఒక ఏనుగు పిల్లతో కలిసి వెళ్తుండడం చూసింది. వాళ్లిద్ధరి మధ్య ఉన్న అనుబంధం ఆమె దృష్టిని ఆకర్షించింది. అతనితో మాట కలిపితే తప్పిపోయిన ఏనుగు పిల్లను ఆయన చేరదీసిన విధానం చెప్పాడు. ఆ సంఘటనే ఆమె కెరియర్ ను మలుపు తిప్పింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా తెరకెక్కించేందుకు ప్రేరేపించింది.




ఈ సినిమాలో బొమన్ , బెల్లి ఇద్దరూ ఏనుగు పిల్లలను నిజంగా పెంచుతున్న వాళ్లే అని.. వాళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని సినిమాగా తీసుకువచ్చినట్లు తెలిపారు కార్తికి. కెమెరా వాళ్ల ముందు లేదు అనే భావన వాళ్లలో కలిగించేందుకు దాదాపు 18 నెలలు వాళ్లతో కలిసి ప్రయాణం చేసింది. వాళ్లతో అనుబంధం పెంచుకుంది. దాదాపు 450 గంటల ఫుటేజీ వచ్చింది. అదే సమయంలో బొమన్, బెల్లీ పెళ్లి చేసుకోవడంతో.. కట్టునాయకన్ తెగ సంస్కృతి కూడా తెరపై తెలియజేసే అవకాశం వచ్చిందని.. షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించే సమయంలో ఎన్నో ఆపాయాలు ఎదురైనా.. అవన్ని అందమైన అనుభవాలే అంటూ చెప్పుకొచ్చింది కార్తికి.