మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలు పెట్టి.. రూ.100 కోట్ల రెమ్యునరేషన్ దగ్గర ఆగాడు

Phani CH

20 February 2025

Credit: Instagram

ఒక మనిషి ఎంత కస్టపడి ఎంత సంపాదించిన కడుపునిండా తినడానికే.. ఈ విషయం తెలిస్తే ఎవరు అత్యాశకు పోరు అన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఒక హీరో మాత్రం ఒకప్పుడు కోలీవుడ్లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. అతను ఎవరో కాదు శివ కార్తికేయన్.

శివ కార్తికేయన్ 1985 ఫిబ్రవరి 17న ఒక తమిళ ఫ్యామిలీలో జన్మించాడు. కాలేజ్ డేస్ లో కల్చరల్ ఈవెంట్స్ జరిగినప్పుడు స్టేజ్ మీద మిమిక్రీ చేస్తూ తన ప్రయాణం మొదలు పెట్టాడు.

ఆ తరువాత నెమ్మదిగా టెలివిజన్ పలు టీవీ షోలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ‘ఎగన్’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థానం సంపాదించగా సినిమా అంతా అయిపోయాక ఫైనల్ కట్ లో ఆయన క్యారెక్టర్ ను తొలగించారు.

ఆ తరువాత 2012లో ‘మెరీనా’ అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై.. ధనుష్ 3 సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇకపోతే ‘రెమో’ అనే డబ్బింగ్ మూవీ తో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువైన శివ కార్తికేయన్..కాలేజ్ డాన్, వరుణ్ డాక్టర్ లాంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు

తాజాగా  ‘అమరన్’ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించి రూ.330 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించారు. త్వరలో రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.