హీరోయిన్ నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. గోమఠేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సిరీస్ లో కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వరి, ప్రేమ్ సాగర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 28న స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం కుమారి శ్రీమతి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మరోసారి తన సహజ నటనతో నిత్య మీనన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. ఈ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. తన తాత కట్టించిన ఇంటిని దక్కించుకోవడానికి ఎంతో కష్టమైన భరించే అమ్మాయి పాత్రలో కనిపించింది నిత్యామీనన్. ఇల్లు సొంతం చేసుకునే వరకు పెళ్లి చేసుకోను అనే ఆ హీరోయిన్.. ఆమె కోసం వెనకపడే హీరో. ఆ ఇంటిని తన బాబాయ్ లాక్కోవడం.. మొత్తం 38 లక్షలు కడితే ఆ ఇల్లు దక్కుతుందని తెలియడంతో బార్ పెట్టాలని రెడీ అవుతుంది.
Presenting Srimathi… #KumariSrimathi
The one who lives on her own terms.Here’s the Trailer ▶️ https://t.co/e52lxq09Gv#KumariSrimathiOnPrime, streaming from September 28th on @PrimeVideoIN.
Best wishes to the team @MenenNithya @Sri_Avasarala @gomtesh_upadhye… pic.twitter.com/jRvB31RxtT
— Nani (@NameisNani) September 22, 2023
ఇక బార్ పెట్టాలనుకుంటున్న హీరోయిన్ నిర్ణయానికి ఎదురైన అడ్డంకులు..వాటన్నింటి ఎదుర్కొని ఆమె బార్ పెట్టిందా ?.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ట్రైలర్ లో కామెడీ, ఎమోషన్ ఎక్కువగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 28న స్ట్రీమింగ్ కానుంది.
‘కుమారి శ్రీమతి’ మీ ఊరు వస్తుంది… మొట్ట మొదటి Episode కి… మొదటి ప్రేక్షకులు మీరే…
కాకినాడ మరియు భీమవరం ప్రేక్షకులకి ఇదే మా ఆహ్వానం…✨#KumariSrimathi First Episode Exclusive Screening On Sep 24th, 4 PM.Register now : https://t.co/EgCUEkHtvN@MenenNithya… pic.twitter.com/0GLS2bGVct
— Swapna Cinema (@SwapnaCinema) September 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.