
రాబిన్ హుడ్ నిరాశపర్చడంతో తమ్ముడుపై భారీ ఆశలే పెట్టుకున్నాడు యూత్ స్టార్ నితిన్. పవన్ కల్యాణ్ టైటిల్, లయ రీ ఎంట్రీతో పాటు సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే తమ్ముడు మూవీపై పాజిటిబ్ బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నిర్మాత దిల్ రాజు భారీగా ప్రమోషన్లు నిర్వహించారు. అయితే జులై 04న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమా ఆడియెన్స్ ను పూర్తిగా నిరాశపర్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ మూవీ చేరక తప్పలేదు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాంతార బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఆడియెన్స్ ను తమ్ముడు సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆగస్టు 01 నుంచే తమ్ముడు సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
తమ్ముడు సినిమాలో స్వసిక విజయన్, హరితేజ, సౌరబ్ సచ్ దేవ, శ్రీకాంత్ అయ్యంగర్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ వర్క్, విక్రమ్ మోర్, రియల్ సతీష్, రవి వర్మ, రామ్ కిషన్ యాక్షన్ కొరియోగ్రఫిని అందించారు.
#Thammudu OTT Release Date Buzz –
According to the reports, the film is likely to premiere on Netflix on August 1, 2025. However, an official announcement is still awaited. pic.twitter.com/N86Ex0SRDz
— Cinema Mania (@ursniresh) July 16, 2025
In the world of #Thammudu, every glance, every silence, every struggle spoke volumes. ❤️🔥
A soul-stirring tale that rises from the shadows of Ambaragodugu.💥
Book Your Tickets Now to witness #Thammudu‘s 𝗕𝗹𝗼𝗰𝗸𝗯𝘂𝘀𝘁𝗲𝗿 𝗣𝗿𝗼𝗺𝗶𝘀𝗲 ❤️
🎟 https://t.co/r54hJN2U9F… pic.twitter.com/8c4WmmSYik— Sri Venkateswara Creations (@SVC_official) July 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి