Extra Ordinary Man: ఓటీటీలోకి వచ్చేసిన నితిన్ ‘ఎక్స్‏ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఎక్కడ చూడొచ్చంటే..

|

Jan 19, 2024 | 8:39 AM

డైరెక్టర్ కమ్ రైటర్ వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. గతేడాది డిసెంబర్ 8న థియేటర్లలలో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కేవలం నితిన్, శ్రీలీల డాన్స్, సాంగ్స్ మాత్రమే ఈ చిత్రానికి హైలెట్ అయ్యాయి. అలాగే అదే సమయంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా విడుదల కావడం..

Extra Ordinary Man: ఓటీటీలోకి వచ్చేసిన నితిన్ ఎక్స్‏ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఎక్కడ చూడొచ్చంటే..
Extra Ordinary Man Movie
Follow us on

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘ఎక్స్‏ట్రా ఆర్డినరీ మ్యాన్’. డైరెక్టర్ కమ్ రైటర్ వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. గతేడాది డిసెంబర్ 8న థియేటర్లలలో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కేవలం నితిన్, శ్రీలీల డాన్స్, సాంగ్స్ మాత్రమే ఈ చిత్రానికి హైలెట్ అయ్యాయి. అలాగే అదే సమయంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా విడుదల కావడం.. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో నితిన్ సినిమాకు అంతగా జనాలు కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. కలెక్షన్స్ వేటలో వెనుకబడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసింది. ఇక గత అర్దరాత్రి నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈచిత్రాన్ని మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూసేయ్యోచ్చు. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. హరీష్ జై రాజ్ సంగీతం అందించారు. ఇందులో రావు రమేష్, పవిత్రా లోకేష్, బ్రహ్మాజీ, సుధేవ్ నాయర్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

ఈ చిత్రంలో నితిన్ ఎర్రబాలు పాత్రలో కనిపించాడు. పోలీసులను ఎదురించి.. వారినుంచి తప్పించుకుని సెల్వమణి (సంపత్) సరుకుని తీసుకొస్తాడు. ఎర్రబాలు తన టీంలో కొత్తగా జాయిన్ అయ్యాడని తెలుసుకుంటాడు సెల్వమణి. అతడి కథ ఏంటో తెలుసుకోవాలని ట్రై చేయగా.. తన గతాన్ని చెబుతాడు ఎర్రబాలు. జూనియర్ ఆర్టిస్ట్ అభినయ్ ఎలా పోలీస్ సాయి నాథ్ అయ్యాడు ?.. అందుకు కారణాలు ఏంటీ ?.. చివరకు ఎర్రబాలుగా ఎందుకు మారాల్సి వచ్చిందనేది ? కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.