Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్… నాని సినిమా డిజిటల్ రైట్స్ ఎవరు తీసుకున్నారంటే..

|

Sep 23, 2021 | 2:04 PM

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్‏లో ఉన్నాడు. వరుసగా రెండు మూడు ప్రాజెక్స్‏ను లైన్లో పెట్టేశాడు. ఇప్పటికే టక్ జగదీష్ సినిమాతో

Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్... నాని సినిమా డిజిటల్ రైట్స్ ఎవరు తీసుకున్నారంటే..
Shyam Singha Roy
Follow us on

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్‏లో ఉన్నాడు. వరుసగా రెండు మూడు ప్రాజెక్స్‏ను లైన్లో పెట్టేశాడు. ఇప్పటికే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు నాని. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా వచ్చిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ముందుగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడి.. ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో చిన్నపాటి వివాదాలను కూడా నాని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇదే కాకుండా.. నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు చేస్తున్నాడు. ఇందులో శ్యామ్ సింగరాయ్ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్‏లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‏ను.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం దాదాపు రూ. 40 కోట్లు చెల్లించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై.. ఆ తర్వాత ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో పది ఎకరాలలో ప్రత్యేక సెట్ రూపొందించారని సమాచారం. ఈ సినిమాను అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందుకోసం సన్నాహాలు కూడా చేస్తున్నారట. మరి చూడాలి.. ఈ సినిమాతో నాని మరో సూపర్ హిట్ అందుకుంటారా లేదా అనేది.

Also Read: Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ రోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..

MAA Elections 2021: రసవత్తరంగా మా ఎన్నికలు.. మంచు విష్ణు టీమ్ ఇదే..