Annapoorani OTT: అప్పుడే ఓటీటీలో నయనతార వివాదాస్పద మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

|

Dec 15, 2023 | 7:30 PM

సినిమా రిజల్ట్‌ సంగతి పక్కన పెడితే అన్నపూర్ణి సినిమాపై హిందూ, బ్రాహ్మాణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందులోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని, ముఖ్యంగా ముస్లిం అబ్బాయి, బ్రాహ్మణ అమ్మాయితో ప్రేమలో పడినట్లు చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాపై నిషేధం విధించాలంటూ డిమాండ్లు కూడా వినిపించాయి.

Annapoorani OTT: అప్పుడే ఓటీటీలో  నయనతార వివాదాస్పద మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Annapoorani Movie
Follow us on

జవాన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నయన తార నటించిన చిత్రం అన్న పూర్ణి. ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనేది మూవీ క్యాప్షన్‌. లేడీ సూపర్‌ స్టార్‌ సినిమా కెరీర్‌లో ఇది 75వ సినిమా. నీలేశ్‌ కృష్ణ తెరకెక్కించిన అన్నపూర్ణి సినిమాలో జర్నీ ఫేమ్‌ జై, సత్యరాజ్‌, అచ్యుత్‌ కుమార్‌, కే ఎస్‌ రవి కుమార్‌, రెడిన్‌ కింగ్‌స్లే, రేణుకు, కార్తీక్‌ కుమార్‌, పూర్ణిమా రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో డిసెంబర్‌ 1 న థియేటర్లలో విడుదలైన అన్నపూర్ణి అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. యావరేజ్‌ టాక్‌తో సరిపెట్టుకుంది. సినిమా రిజల్ట్‌ సంగతి పక్కన పెడితే అన్నపూర్ణి సినిమాపై హిందూ, బ్రాహ్మాణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందులోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని, ముఖ్యంగా ముస్లిం అబ్బాయి, బ్రాహ్మణ అమ్మాయితో ప్రేమలో పడినట్లు చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాపై నిషేధం విధించాలంటూ డిమాండ్లు కూడా వినిపించాయి. ఇలా వివాదాలతో వార్తల్లో నిలిచిన అన్న పూర్ణి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజైన నెలరోజులకే నయన తార సినిమా ఓటీటీలోకి వస్తుండడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5 అన్నపూర్ణి మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్‌ 29 నుంచి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తమిళ్‌ తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ నయన తార సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

 

ఇవి కూడా చదవండి

జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా అన్నపూర్ణి సినిమాను నిర్మించారు. థమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా కథ మొత్తం నయనతార పాత్ర చుట్టూ తిరుగుతుంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె ఇండియాలో బెస్ట్‌ చెఫ్‌ అవ్వాలని కలలు కంటుంది. అయితే ఆమె తల్లిండ్రులు అడ్డు చెబుతారు. వారికి తెలియకుండా స్నేహితుడు ఫర్హాన్‌ (జై) తో కలిసి ఛెఫ్‌ కోర్సులో జాయిన్‌ అవుతుంది. మరి ఇండియన్ బెస్ట్‌ చెఫ్‌ పోటీల్లో నయన తార ఎలా విజేతగా నిలిచింది. ఒక యాక్సిడెంట్‌లో రుచిని తెలుసుకునే శక్తిని కోల్పోయిన నయన తన కలను ఎలా సాకారం చేసుకుందో తెలుసుకోవాలంటే అన్న పూర్ణి సినిమా చూడాల్సిందే.

 

అన్న పూర్ణి ప్రమోషన్లలో నయన తార..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.