AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: ఓటీటీ కోసం చైతూ సాహసం.. ‘ధూత’ సిరీస్ సెన్సెషన్ .. నాగచైతన్య రియాక్షన్ ఇదే..

హారర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ లో మొదటిసారి జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు చైతూ. ఇన్నాళ్లు లవర్ బాయ్ గా కనిపించిన చైతన్య.. ఇందులో మాత్రం సీరియస్ రోల్ పోషించాడు. ఈ సిరీస్ కు అమెజాన్ ప్రైమ్ వీడిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా చైతూ నటనకు అడియన్స్, సినీ విమర్శకుల ఫిదా అయ్యారు. విడుదలైన మొదటి వారంలోనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో ఈ సిరీస్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇక రెండో వారంలోనూ ఈ సిరీస్ నెంబర్ 1 స్థానంలోనే ట్రెండ్ కొనసాగుతుంది.

Naga Chaitanya: ఓటీటీ కోసం చైతూ సాహసం.. 'ధూత' సిరీస్ సెన్సెషన్ .. నాగచైతన్య రియాక్షన్ ఇదే..
Dhootha
Rajitha Chanti
|

Updated on: Dec 15, 2023 | 7:06 PM

Share

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల ధూత వెబ్ సిరీస్‏తో ఓటీటీ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ లో మొదటిసారి జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు చైతూ. ఇన్నాళ్లు లవర్ బాయ్ గా కనిపించిన చైతన్య.. ఇందులో మాత్రం సీరియస్ రోల్ పోషించాడు. ఈ సిరీస్ కు అమెజాన్ ప్రైమ్ వీడిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా చైతూ నటనకు అడియన్స్, సినీ విమర్శకుల ఫిదా అయ్యారు. విడుదలైన మొదటి వారంలోనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో ఈ సిరీస్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇక రెండో వారంలోనూ ఈ సిరీస్ నెంబర్ 1 స్థానంలోనే ట్రెండ్ కొనసాగుతుంది. ఓటీటీలో ఒక మాసివ్ డెబ్యూ అందుకున్నాడు చైతూ. ఈ సందర్భంగా చైతూ DNAకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధూత విజయం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలోని హీరోలను తమ అభిమానులు ఒక నిర్ధిష్ట ఇమేజ్ వరకు ఆశిస్తుంటారు. అందుకే చాలా సార్లు తారలు విభిన్నమైన పాత్రలు చేసేందుకు ఆలోచిస్తుంటారు. కానీ చైతూ మాత్రం ధూత వెబ్ సిరీస్ కోసం సాహాసమే చెశాడు. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ.. ఓటీటీ వెబ్ సిరీస్ కోసం ఎక్కువగా ఆలోచించలేదు. పూర్తిగా భిన్నమైన పాత్రను ప్రయత్నించాలనుకున్నానని.. అందుకు ఓటీటీ ప్లాట్ ఫాం సరైన స్థలం అని భావించానని అన్నారు. ప్రేక్షకులకు సరికొత్తగా కనిపించేందుకు ఇది సరైన స్థలమని అనుకున్నానని అన్నారు.

ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసేందుకు టికెట్ కొనుక్కోని వినోదాన్ని ఆశిస్తారు. అందుకు తగిన సమయం కేటాయిస్తారు. కాబట్టి థియేటర్లలోకి వచ్చే ముందు వారి అంచనాలు భిన్నంగా ఉంటాయి. కానీ ఓటీటీలో అలా కాదు. ఇక్కడ కంఫర్ట్ జోన్ లో ఉంటారు. అందుకే ఓటీటీలో అన్ని సినిమాలను ఆదరిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు చైతూ. ఈ సిరీస్ లో పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ , రవీంద్ర విజయ్ కీలకపాత్రలు పోషించాడు. ప్రస్తుతం చైతూ.. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వంలో తండెల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us