
పొలిమేర సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. అయితే ఈ సినిమాల కంటే ముందే సుమారు ఆరేళ్ల క్రితం నవీన్ చంద్రతో ఓ సినిమాను తెరకెక్కించారు. కరోనాకు ముందే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పలు కారణాలతో వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఏప్రిల్ 4న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. సరికొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో చాలామంది ఆడియెన్స్ కు ఈ థ్రిల్లర్ మూవీ రీచ్ కాలేకపోయింది. ఇప్పుడీ కొత్త సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో కార్తిక్ (నవీన్ చంద్ర) మెడిసిన్ చదివే సమయంలో అంజలి (షాలిని)తో ప్రేమలో పడతాడు. అనాథ అయిన కార్తిక్‌ను పెళ్లి చేసుకోవడానికి అంజలి ఇంట్లో వారు అంగీకరించరు. దీంతో ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకుంటారు.
పెళ్లి అయిన తర్వాత అంజలికి ఆరోగ్య సమస్య లు తలెత్తుతాయి. 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు షాలినీ చనిపోతుంది. ఆ తర్వాత ఆమె ఆత్మ కార్తిక్‌ను వెంటాడుతుందని అనుమానాలు కలుగుతాయి. మరి అంజలి నిజంగా చనిపోయిందా? కార్తిక్ ఉంటోన్న ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అనేవి తెలియాలంటే ‘28 డిగ్రీస్ సెల్సియస్’ సినిమా చూడాల్సిందే.
సరికొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ..
చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా? అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్‌సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ ఈ సినిమాను నిర్మించారు. నవీన్ చంద్ర, అంజలితో పాటు ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునే వారు ‘28 డిగ్రీస్ సెల్సియస్’ పై ఒక లుక్ వేసుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.