Malli Pelli OTT: రెండు ఓటీటీల్లో నరేశ్‌, పవిత్ర ‘మళ్లీ పెళ్లీ’.. స్ట్రీమింగ్‌ డేట్స్‌, టైమింగ్స్‌ వివరాలివే

|

Jun 21, 2023 | 10:51 AM

థియేట్రికల్‌ రన్‌ను ముగించుకున్న మళ్లీ పెళ్లీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో శుక్రవారం (జూన్‌ 23) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

Malli Pelli OTT: రెండు ఓటీటీల్లో నరేశ్‌, పవిత్ర మళ్లీ పెళ్లీ.. స్ట్రీమింగ్‌ డేట్స్‌, టైమింగ్స్‌ వివరాలివే
Malli Pelli Ott
Follow us on

వీకే నరేశ్‌, పవిత్రా లోకేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లీ. గత కొంతకాలంగా నరేశ్‌, పవిత్రల నిజ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆధారంగా చేసుకుని సీనియర్‌ దర్శక నిర్మాత ఎమ్మెస్‌ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై వీకే నరేశ్‌ స్వయంగా మళ్లీ పెళ్లీ సినిమాను నిర్మించాడు. టీజర్లు, ట్రైలర్లతో రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అయితే థియేటర్లలో రిలీజయ్యాక ఏ ప్రభావం చూపించలేకపోయింది. అయితే గట్టిగా ప్రమోషన్లు చేయడంతో డీసెంట్‌గానే కలెక్షన్లు వచ్చాయి. ఈక్రమంలో థియేట్రికల్‌ రన్‌ను ముగించుకున్న మళ్లీ పెళ్లీ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో శుక్రవారం (జూన్‌ 23) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

 

ఇవి కూడా చదవండి

‘ప్రేమకు వయసుతో సంబంధం ఉంటుందా? ప్రేమకు పెళ్లే కొలమానమా? వీటన్నిటికీ ‘ఆహా’ మళ్లీ పెళ్లిలో సమాధానం దొరుకుతుంది’ అని మళ్లీ పెళ్లీ స్ట్రీమింగ్‌ వివరాలను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది ఆహా.

 

ఆహాతో పాటు  మరో ఓటీటీలో ప్లాట్‌ఫామ్‌లోనూ మళ్లీ పెళ్లీ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.  అమెజాన్ ప్రైమ్ వీడియోలనూ జూన్‌ 23 నుంచి ఈ మూవీ రిలీజ్‌ కానుంది. మరి థియేటర్లలో మళ్లీ పెళ్లీ సినిమాను మిస్‌ అయిన వారు మీకు నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..