
గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న నారా రోహిత్.. ఈ ఏడాది ‘భైరవం’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా హీరోలుగా నటించిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. దీని తర్వాత సుందర కాండ అనే మరో సినిమాతో మన ముందుకొచ్చాడు నారా రోహిత్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో వృతి వాఘవి హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరోయిన్ శ్రీదేవి మరో కీలక పాత్ర పోషించింది. ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాగానే ఆడింది. యువతను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. నారా రోహిత్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన సుందర కాండ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అది కూడా నెలలోపే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నెల 23 నుంచి సుందర కాండ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
.
వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన సుందర కాండ సినిమాలో నరేష్, వాసుకీ ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమఠం, విశ్వంత్, రూప లక్ష్మి, సునైనా, రఘు బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ సారథ్యంలో సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ సుందర కాండ సినిమాను నిర్మించారు. లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో అనుకోకుండా తల్లీ కూతుళ్లన ప్రేమించాల్సి వస్తుంది. మరి చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సుందర కాండ సినిమా చూడాల్సిందే.
No two love stories are the same! ♥️✨
Get ready to experience #Sundarakanda from September 23rd exclusively on JioHotstar! 💫#SundarakandafromSept23rd #JioHotstar #JioHotstarTelugu pic.twitter.com/lJhzHNoegr
— JioHotstar Telugu (@JioHotstarTel_) September 17, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.