Lakshya Movie: ఓటీటీలోకి నాగశౌర్య సినిమా.. ఆహాలో లక్ష్య విడుదల ఎప్పుడంటే..
యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం లక్ష్య. డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం
యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం లక్ష్య. డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కోసం నాగశౌర్య విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందులో రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు నాగశౌర్య. తాజాగా ఈ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో లక్ష్య సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాళ భైరవ సంగీతాన్ని సమకూర్చగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు..
ట్వీట్..
గమనమా, గమ్యమా? ఏది ముఖ్యం? Watch sports action drama #Lakshya Jan 7 on aha.@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/3xCb5pFrax
— ahavideoIN (@ahavideoIN) December 27, 2021
Also Read: RRR Movie Pre Release Event Live: అంగరంగ వైభవంగా ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. లైవ్‌లో చూసేయ్యండి..
RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్..
RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్.. 2 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో..