
చాలా కాలం తర్వాత టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఖాతాలో హిట్టు పడింది. ఘోస్ట్ డిజాస్టర్ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న నాగ్.. ఈ ఏడాది సంక్రాంతికి ‘నా సామిరంగ’ అంటూ ప్రేక్షకులను పలకరించారు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ నాగ్ కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించారు. పండక్కి వచ్చిన అన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. ఇక ఇప్పుడు నా సామిరంగ సినిమా కూడా వచ్చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను థియేటర్లలో మిస్ అయినవారు.. ఇప్పుడు హాట్ స్టార్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత ఈ మూవీ నాగ్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించి అదరగొట్టేశారు. ఇక ఈ మూవీలో అల్లరి నరేష్, నాగ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
నా సామిరంగ కథ విషయానికి వస్తే..
కిష్టయ్య (నాగార్జున) అనాథ. అంజి (అల్లరి నరేష్) తల్లి అతడిని చేరదీస్తుంది. అప్పటినుంచి ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. తల్లి చనిపోయిన తర్వాత వారిద్దరికి ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) అండగా నిలబడతాడు. 12 ఏళ్ల వయసులోనే కిష్టయ్య వరాలు (ఆషికా రంగనాథ)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. చదువు కోసం పట్టణానికి వెళ్లిన ఆమె.. తిరిగి 15 ఏళ్లకు వస్తుంది. తన ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పేందుకు వరాలును తీసుకుని ఇంటికి వెళ్తాడు కిష్టయ్య.
సరిగ్గా అప్పుడే ఆమె తండ్రి వరదరాజులు (రావు రమేష్) తన కూతుర్ని పెద్దయ్య కొడుకు దాసు (షబ్బిర్)కు ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకోవడానికి వస్తాడు. అయితే వీరి ప్రేమ విషయం తెలుసుకున్న పెద్దయ్య వరాలును తన ఇంటి కోడలును చేసుకోవడానికి అంగీకరించడు. వరాలు తండ్రి కిష్టయ్యతో తన కూతురి విహహం చేసేందుకు ససేమిరా అంటాడు. దీంత వీరిద్దరి ప్రేమకథ ఏమైంది ?.. రాజ్ తరుణ్, రుక్సార్ ప్రేమకథ ఏంటీ ?.. అన్న స్టోరీ తెలియాలంటే నాసామిరంగ చూడాల్సిందే.
#NaaSaamiRanga
Now Streaming On #DisneyPlusHotstar #Nagarjuna #AllariNaresh #RajTarun #AshikaRanganath #Mirnaa #RuksharDhillon pic.twitter.com/NONMk1EUwa— Cinema Mania (@ursniresh) February 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.