800 Movie: ఓటీటీలోకి ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. ‘800’ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

|

Nov 14, 2023 | 3:22 PM

ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించగా.. ఈ ఏడాది అక్టోబర్ 6న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలాయళం భాషలలో విడుదలైంది. ఇక శ్రీలంకలో సింహళ భాషలో విడుదలైంది. ఇందులో ముత్తయ్య మురళీధర్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. అలాగే అతని భార్య పాత్రలో మహిమా నంబియార్ కనిపించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. ముత్తయ్య మురళీధర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా.. అక్టోబర్ 6న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.

800 Movie: ఓటీటీలోకి ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. 800 ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
800 Movie
Follow us on

శ్రీలంక లెజెండరీ క్రికెటర్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవిత కథను ఇటీవల వెండితెరపైకి తీసుకువచ్చారు డైరెక్టర్ ఎంఎస్ శ్రీపతి. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహాన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ రాశారు. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించగా.. ఈ ఏడాది అక్టోబర్ 6న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలాయళం భాషలలో విడుదలైంది. ఇక శ్రీలంకలో సింహళ భాషలో విడుదలైంది. ఇందులో ముత్తయ్య మురళీధర్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. అలాగే అతని భార్య పాత్రలో మహిమా నంబియార్ కనిపించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. ముత్తయ్య మురళీధర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా.. అక్టోబర్ 6న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికపై అలరించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చె నెల అంటే డిసెంబర్ 2 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో సినిమా ట్వీట్ చేసింది. అయితే థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాల్సి ఉంది. ఈ సినిమాలో శరత్ లోహితస్య కీలకపాత్రలో కనిపించారు.

ఇవి కూడా చదవండి

సినిమా విషయానికి వస్తే..

ఈ మూవీలో కేవలం క్రికెట్.. 800 వికెట్స్ అంశాలే కాకుండా ముత్తయ్య మురళీధర్ జీవితంలో జరిగిన విషయాలను చూపించారని తెలుస్తోంది. తన బాల్యంలో శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడులు.. క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎదురైన అవమానాలు తెరపై అడియన్స్ కళ్లకు ముందుకు తీసుకువచ్చారు. అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా రెస్పాన్స్ అందుకోలేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.