Telugu Indian Idol 3: ఫోక్ సింగర్కు మాటిచ్చిన తమన్.. పవన్ కళ్యాణ్ ఓజీలో ఛాన్స్..
గతంలో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబోలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలోనూ పద్మ శ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగులయ్య చేత ఓ సాంగ్ పాడించారు తమన్. ఇక ఇప్పుడు మరోసారి పవన్ సినిమా కోసం మరోసారి జానపద గాయని చేత మరో పాట పాడించనున్నారు. ఇప్పుడు ఆహా స్టేజ్ మీద ఫోక్ సింగర్ లక్ష్మీకి ఓజీ సినిమాలో పాడిస్తానంటూ మాటిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో గీతా మాధురి, తమన్, విజయ్ యేసుదాస్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోలో కడప నుంచి వచ్చిన ఫోక్ సింగర్ లక్ష్మీ గాత్రానికి తమన్ ఫిదా అయ్యారు. ఆమె పర్ఫామెన్స్కు అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వగా.. ఇంత అద్భుతమైన న్యాచురల్ టాలెంట్ ఉన్న ఫోక్ సింగర్ లక్ష్మీకి పవన్ కళ్యాణ్ సినిమా ఓజీలో పాడే అవకాశం అందించారు తమన్. తన సినిమాల్లో జానపద గాయకులకు తమన్ ముందు నుంచి అవకాశాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబోలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలోనూ పద్మ శ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగులయ్య చేత ఓ సాంగ్ పాడించారు తమన్. ఇక ఇప్పుడు మరోసారి పవన్ సినిమా కోసం మరోసారి జానపద గాయని చేత మరో పాట పాడించనున్నారు. ఇప్పుడు ఆహా స్టేజ్ మీద ఫోక్ సింగర్ లక్ష్మీకి ఓజీ సినిమాలో పాడిస్తానంటూ మాటిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

