Drishyam 3 OTT: ఓటీటీలోకి మోహన్ లాల్ ‘దృశ్యం 3’! బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ‘దృశ్యం’ ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు సినిమాలు రాగా అన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం 3 సినిమా 230 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

Drishyam 3 OTT: ఓటీటీలోకి మోహన్ లాల్ దృశ్యం 3! బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Drishyam 3 Movie

Updated on: Jun 07, 2026 | 5:23 PM

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జాబితా తీస్తే అందులో దృశ్యం చిత్రాలు టాప్ ప్లేస్ లో ఉంటాయి. సూపర్ స్టార్ మోహన్ లాల్ దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలా ఈ క్రేజీ సిరీస్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘దృశ్యం 3’. మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ నే మూడో సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్ 66వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం 3 సినిమా మే 21 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి రెండు భాగాలతో పోలిస్తే ఈ మూడో పార్ట్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తగ్గాయని కామెంట్స్ వినిపించాయి. అయితే వసూళ్లలో మాత్రం ఈ సినిమా అదరగొడుతోంది.ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.230.23 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో పెద్దగా ఆడడం లేదు కానీ మలయాళంలో ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. అయితే థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం 3 సినిమాను ఓటీటీ లో చూడాలని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దృశ్యం 3 సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ కు, ఓటీటీ విడుదలకు మధ్య ఉండే ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ నిబంధనే ఈ మూవీకి కూడా వర్తించనుంది. ఈ లెక్కన చూసుకుంటే జూన్ చివరి వారంలో దృశ్యం 3 సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా సమాచారం ప్రకారం జూన్ 18 లేదా 25 తేదీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.

ఆశీర్వాద్‌ సినిమాస్‌, పనోరామా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన దృశ్యం 3 సినిమాలో మోహన్ లాల్ సరసన మీనా కథానాయికగా నటించింది. అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, కళాభవన్‌ షాజోన్, సిద్ధిఖ్, మురళీ గోపి, ఆశా శరత్, బిజూ మేనన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిల్‌ జాన్సన్‌ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us