నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది మెహరీన్. ఇందులో తన క్యూట్ యాక్టింగ్‌తో అందరినీ కట్టేపడేసిందీ పంజాబీ బ్యూటీ. ఆ తర్వాత మహానుభావుడు, కేరాఫ్ సూర్య, పంతం, జవాన్, నోటా, కవచం, ఎఫ్ 2, ఎఫ్ 3, ఎంత మంచి వాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయ్ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే గతంలో వేగంగా సినిమాలు చేసిన మెహరీన్ ఈ మధ్యన సిల్వర్ స్క్రీన్‌పై ఎక్కువగా కనిపించడం లేదు. అయితే సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది మెహరీన్. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్‌లో పంజాబీ ముద్దుగుమ్మ ఓ కీలక పాత్ర పోషించింది. మిలన్ లుత్రియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో తాహిర్ రాజ్ భాసిన్, అనుజ్ శర్మ, మౌని రాయ్, అనుప్రియ గోయెంకా, హర్లీన్ సేథి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అర్నాబ్ రే రచించిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: అసెన్షన్’ అనే పుస్తకం ఆధారంగా ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సిరీస్ తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఢిల్లీ ఆఫ్ సుల్తాన్ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
అక్రమంగా ఆయుధాల్ని సరఫరా చేసే ఇద్దరు స్నేహితుల కథతో ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇక సిరీస్ కథ విషయానికి వస్తే.. పాకిస్థాన్‌లో నివసిస్తున్న అర్జున్ భాటియా ( తాహిర్ రాజ్ భాసిన్ ) కథ ఇది . దేశ విభజన సమయంలో సర్వం కోల్పోయిన అర్జున్ తన తండ్రి చేయి పట్టుకుని ఇండియా వస్తాడు. సర్వం కోల్పోయిన షాక్‌తో మానసిక సమతుల్యం కోల్పోయిన తన తండ్రితో కలిసి శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటాడు. ఇదే సమయంలో అర్జున్ తన హక్కుల కోసం పోరాడుతాడు. మరి అతను ఢిల్లీ అండర్ వరల్డ్ ‘సుల్తాన్’గా ఎలా మారిపోయాడన్నదే సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ కథ. ఇందులో మెహరీన్ సంజన అనే అమ్మాయి పాత్రలో నటించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.