Acharya: ఓటీటీలోకి ఆచార్య వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

|

Apr 29, 2022 | 6:02 PM

థియేటర్లలో మెగా హంగామా మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా (Acharya ) ఏప్రిల్ 29న ఘనంగా విడుదలైంది.

Acharya: ఓటీటీలోకి ఆచార్య వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Acharya
Follow us on

థియేటర్లలో మెగా హంగామా మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా (Acharya ) ఏప్రిల్ 29న ఘనంగా విడుదలైంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్. మెగాపవర్ స్టార్ కలిసి నటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గత అర్థ రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లోని ఆచార్య థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇందులో చరణ్ సరసన పూజా హెగ్డే నటించగా.. ప్రతి నాయకుడి పాత్రలో సోనూ సూద్ కనిపించాడు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో చరణ్, చిరంజీవి నక్సల్స్ పాత్రలో కనిపించి మెప్పించారు. అయితే ఓవైపు థియేటర్లలో ఆచార్య సందడి చేస్తుండగా.. మరోవైపు ఆచార్య ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతుంది.

ఆచార్య సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్స్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో విడుదలైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలో రానుందని టాక్. మే చివరి వారంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా కాకుండా.. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు చరణ్… డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Naga Chaitanya: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య.. హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లో చైతూ..

Kajal Aggarwal: ఆచార్య సినిమాలో లేని కాజల్.. అయినా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ?.. ఎంతంటే..

Nikhil: మీకు కొడుకుగా ఉన్నందుకు ప్రతిక్షణం గర్వపడ్డాను.. తండ్రి మరణంపై హీరో నిఖిల్ భావోద్వేగ లేఖ..

Acharya Movie: బాస్ ఈజ్ బ్యాక్.. థియేటర్లలో ఆచార్య సందడి.. ఫ్యాన్స్ ఆందోళన.. ఎందుకంటే..