Falimy OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ సూపర్‌ హిట్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

|

Dec 20, 2023 | 3:00 PM

ఇప్పుడు మరొక మలయాళ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే జయ జయ జయహే మూవీ ఫేమ్‌ బసిల్ జోసెఫ్ నటించిన ఫలిమీ. ఈ ఏడాది నవంబర్‌ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. థియేటర్లలో బాగానే ఆడిన ఫలిమీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది.

Falimy OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ సూపర్‌ హిట్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Falimy Movie
Follow us on

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతివారం ఏదో ఒక మాలీవుడ్ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వస్తుంటాయి. ఇక్కడి ప్రేక్షకుల కోసం తెలుగులో డబ్బింగ్ చేసి మరీ రిలీజ్‌ చేస్తున్నారు. జయ జయ జయహే, 2018, పద్మినీ, కాసర్ గోల్డ్, కన్నూర్‌ స్క్వాడ్‌ ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌ ఆదరణ దక్కించుకున్నాయి. ఇప్పుడు మరొక మలయాళ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే జయ జయ జయహే మూవీ ఫేమ్‌ బసిల్ జోసెఫ్ నటించిన ఫలిమీ. ఈ ఏడాది నవంబర్‌ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. థియేటర్లలో బాగానే ఆడిన ఫలిమీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌ కు అందుబాటులో వచ్చేసింది. నితీష్ సహదేవ్ తెరకెక్కించిన ఫలిమీ సినిమాలో బసిల్ జోసెఫ్‌ తో పాటు జగదీశ్, మంజూ పిళ్ళై, సందీప్ ప్రదీప్, మీనరాజ్, రైనా రాధాకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఫలిమీ సినిమా కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో తీసిన రోడ్ జర్నీ మూవీ ఇది. అనూప్ (బసిల్ జోసెఫ్‌) ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తుంటాడు. ఇంట్లో ఖాళీగా ఉండే తండ్రి, ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేసే తల్లి, విదేశాలకు వెళ్లాలనుకునే తమ్ముడు, కాశీకి పోవాలని ప్రయత్నాలు చేసే తాతయ్య.. ఇది అనూప్‌ ఫ్యామిలీ స్టోరీ. 15 మంది అమ్మాయిలను చూసిన తర్వాత అనూప్‌ కు పెళ్లి కుదురుతుంది. అయితే నిశ్చితార్థం రోజున జరిగిన ఒక సంఘటనతో పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కాశీ వెళ్లిపోతారు. మరి కాశీ ప్రయాణంలో అనూప్‌ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నదే ఫలిమీ సినిమా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..