Grrr OTT: మద్యం మత్తులో సింహం బోనులోకి.. ఆ తర్వాత ఏమైందంటే? ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. ఎందులోనంటే?
లయాళం వెర్సటైల్ యాక్టర్లు కుంచకో బోబన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ‘గర్ర్’. సింహగర్జన శబ్దమే టైటిల్‍గా పెట్టిన ఈ సర్వైవల్ కామెడీ మూవీ జూన్ 14న మలయాళంలో విడుదలై మంచి విజయాన్నిసాధించింది. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది

ఓటీటీలో మలయాళ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. ఈ మాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలపై చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. రియాలిటీకి దగ్గరగా ఉండడం, కొత్త రకమైన కాన్సెప్ట్, సరికొత్త టేకింగ్‌తో తెరకెక్కే మలయాళ సినిమాలంటే ఇప్పుడు అన్ని భాషల వారు ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు కూడా మలయాళంలోని సూపర్ హిట్ సినిమాలను ఆయా భాషల్లోకి అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక సూపర్ హిట్ సినిమానే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే మలయాళం వెర్సటైల్ యాక్టర్లు కుంచకో బోబన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ‘గర్ర్’. సింహగర్జన శబ్దమే టైటిల్‍గా పెట్టిన ఈ సర్వైవల్ కామెడీ మూవీ జూన్ 14న మలయాళంలో విడుదలై మంచి విజయాన్నిసాధించింది. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ‘గర్ర్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20న ఈ మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ గర్ర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ గర్ర్ సినిమాకు జై కే దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సూరజ్ వెంజరమూడ్, కుంచాకో బోబన్‌తోపాటు శృతి రామచంద్రన్, అనఘ, రాజేష్ మాధవన్, మంజు పిళ్లై, శోభి తిలకన్, సెంథిల్ కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు సినిమా బ్యానర్‌పై షాజీ నదేశన్, ఆర్య కలిసి నిర్మించిన ఈ సినిమాకు డాన్ విన్సెంట్, కాళిదాస్ మీనన్, టోనీ టార్జ్ స్వరాలు సమకూర్చారు. జయేశ్ నాయర్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించగా, వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. కేరళలోని తిరువనంతపురం జూలో ఈ సినిమా కథ మొత్తం సాగుతుంది. మద్యం మత్తులో పొరపాటున జూలోని సింహం బోనులోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తప్పించుకోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
Operation Jungle King starts..#Grrr is now streaming on #DisneyPlusHotstar #GRRROnDisneyPlusHotstar #KunchackoBoban #SurajVenjaramoodu #JayK #AugustCinemas #ShrutiRamachandran #Anagha #RajeshMadhavan #RameshPisharody #Comedy #Survival #Drama #Family #Romance #GrrrMovie pic.twitter.com/12ptv6OxaW
— DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) August 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








