AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horror Movie OTT: ఓటీటీల్లో వణికిస్తోన్న హారర్ మూవీ.. ఇప్పుడు యూట్యూబ్‏లోనూ చూడొచ్చు..

కార్డ్స్ గేమ్ ఆడే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓజా బోర్డ్ లో ఆత్మలను పిలిచి వారిని ప్రశ్నలను అడిగే క్రమంలో చిక్కుల్లో పడడం... అలాగే టారోట్ కార్డ్స్ అన్ని ఆత్మల బొమ్మలతో ఉంటాయి. ఒక్క ఆత్మకు ఒక్కో శైలి ఉంటుంది. ఎవరికి ఏ కార్డ్ వస్తుందో అందులోని ఆత్మ బయటకు వచ్చి వారిని భయంతో పరుగులు పెట్టిస్తుంది. అందులో కొందరు చనిపోతారు. భయంకర గేమ్ నుంచి ఎంత మంది బయటపడ్డారు.. ? అనేది సినిమా.

Horror Movie OTT: ఓటీటీల్లో వణికిస్తోన్న హారర్ మూవీ.. ఇప్పుడు యూట్యూబ్‏లోనూ చూడొచ్చు..
Tarot
Rajitha Chanti
|

Updated on: Aug 21, 2024 | 7:05 AM

Share

హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అనుక్షణం భయంతో వణికించే సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రాలను చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ట్విస్టులు.. ఊహించని థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎంగేజింగ్ గా ఉండే హారర్ చిత్రాలకు ఇప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో హారర్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. రోటీన్ కథ అయినా.. హారర్ సినిమాల్లో ఏదోక కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కుగా ఆత్మలు, పగలు, మూడ నమ్మకాలు ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు వస్తున్నాయి. అలాంటి తరహాలో వచ్చిన సినిమానే టారోట్. కార్డ్స్ గేమ్ ఆడే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓజా బోర్డ్ లో ఆత్మలను పిలిచి వారిని ప్రశ్నలను అడిగే క్రమంలో చిక్కుల్లో పడడం… అలాగే టారోట్ కార్డ్స్ అన్ని ఆత్మల బొమ్మలతో ఉంటాయి. ఒక్క ఆత్మకు ఒక్కో శైలి ఉంటుంది. ఎవరికి ఏ కార్డ్ వస్తుందో అందులోని ఆత్మ బయటకు వచ్చి వారిని భయంతో పరుగులు పెట్టిస్తుంది. అందులో కొందరు చనిపోతారు. భయంకర గేమ్ నుంచి ఎంత మంది బయటపడ్డారు.. ? అనేది సినిమా. ఆద్యంతం ట్విస్టులు, భయంకరమైన సీన్స్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా ఆగస్ట్ 3 నుంచి ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.. అయితే ఇప్పుడు ఈ సినిమా కేవలం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కాకుండా యూట్యూబ్‏లోనూ అందుబాటులోకి వచ్చేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఓటీటీలో కాకుండా యూట్యూబ్ లో ఈ సినిమా ఫ్రీగా చూసేందుకు ఛాన్స్ లేదు. ఈ చిత్రాన్ని చూడాలంటే రూ.120 రెంట్ కట్టాల్సిందే. ఇక ఈ సినిమా అటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. కానీ అక్కడ కూడా రూ.119 చెల్లించి చూడాలి. ప్రైమ్ వీడిలో ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక జీ5 ఓటీటీలో రూ.99 పే చేసి ఈ సినిమాలు చూడాలి. మిగతా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ ఈ సినిమా చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. కేవలం నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే ఈ సినిమా ఫ్రీగా చూడొచ్చు.

ఇన్నాళ్లు ఓటీటీలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లోనూ చూడొచ్చు. కానీ ఇక్కడ కూడా అమౌంట్ చెల్లించి రెంట్ విధానంలో సినిమానూ చూసేందుకు వీలుంది. ఈ సినిమాలో భయంకరమైన సీన్స్.. ఊహించని ట్విస్టులు ఉండడంతో టారోట్ మూవీ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.