
ఈమధ్య కాలంలో కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్, భారీ బడ్జెట్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తుంది. కేవలం రూ.2.4 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకు వసూల్లు రాబట్టింది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు లిటిల్ హార్ట్స్. మౌళి తనూజ్, శివానీ నాగారం నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లోకి వచ్చేసింది. థియేటర్ల కంటే అదనపు రన్ టైమ్ తో ఈ మూవీ ప్రీమియర్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
తొలి రెండు రోజుల్లోనే ఈ లిటిల్ హార్ట్స్ మూవీ 100 మిలియన్స్ అంటే దాదాపు 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డ్ అందుకుంది. ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. తక్కువ సమయంలోనే భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా ఓ రేంజ్ వసూల్లు రాబట్టింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ప్రస్తుతం ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కీలకపాత్ర పోషించారు. 90’S వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మించారు. కేవలం 2 కోట్లతో నిర్మించిన ఈ మూవీ రూ.40 కోట్లు రాబట్టింది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..