ఈ వారం థియేటర్ రిలీజెస్ లలో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా మదగజరాజా. విశాల్ నటించిన ఈ తమిళ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ కానుంది. మరి ఇక్కడి ఆడియెన్స్ విశాల్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో. ఇక అప్సర రాణి రాచరికం, మహిష వంటి చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఓటీటీల విషయానికి వస్తే.. ఈ వారం పెద్దగా తెలుగు సినిమాలు రిలీజ్ కావడం లేదు కానీ.. ఉన్నంతలో ఆసక్తికర డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఐడెంటిటీ. గత శుక్రవారమే థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ కాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇందులో త్రిష, టొవినో థామస్, వినయ్ రాజ్ లు ప్రధాన పాత్రల్లో పోషించారు.దీంతో పాటు పోతగడ్డ అనే తెలుగు సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. ఇందులో పృథ్వీ, విస్మయ శ్రీ , శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించారు. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లోసందడి చేయనున్నాయి. మరి అవేంటో ఒక లుక్కేద్దాం రండి.
Pothugadda Theme song out tomorrow 💥🎶#Pothugadda steaming from January 30th, exclusively on @etvwin ❤🔥#ETVWinOriginals@ShatruActor @Prashantalakun2 @TheprudhviD @VismayaSri @venkylingam @aadvikbandaru5 @Actor.krheash @dharma_rak489 @Rahulshrivatsav @rv_pavankumar… pic.twitter.com/XuJPvAGZrE
— ETV Win (@etvwin) January 24, 2025
Three siblings, one soulful journey. #Identity, streaming from 31st January on ZEE5!
PREMIERES 31st JANUARY Malayalam | Tamil | Kannada | Telugu@akhilpaul_ @anaskhan_offcl @tovinothomas @trishakrishnan @vinayrai79 @akhilpaul_ @anaskhan_offcl #RajuMalliath #DrRoyCJ… pic.twitter.com/NelrQLOaK4
— ZEE5 Keralam (@zee5keralam) January 26, 2025
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.