కొత్త సంవత్సరం కానుకగా ఈ వారం ఒక మలయాళ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలోకి రానుంది. ఉన్ని ముకుందన్ నటించిన మార్కో తెలుగు వెర్షన్ జనవరి 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తప్పితే ఈ వారం పెద్దగా ఆసక్తికర సినిమాలేవీ లేవు. అయితే ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ పలు ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’. ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో ప్రదర్శితమైన ఈ సినిమా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా తెగ నచ్చేసింది. కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధానపాత్రల్లో నటించారు. ముంబయిలోని ఇద్దరు నర్సుల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక హాలీవుడ్ గ్లాడియేటర్ 2 తో పాటు పలు ఇంగ్లిష్ మూవీస్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి కొత్త సంవత్సరంలో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, వెబ్ సిరీసు లేంటో ఓ లుక్కేద్దాం రండి.
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.