AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: జులైలో ఓటీటీలోకి రానున్న సూపర్ హిట్ సినిమాలివే.. లిస్టులో మోస్ట్ అవైటెడ్ సిరీస్ సీక్వెల్ కూడా..

టీ20 ప్రపంచకప్ ఫీవర్ ముగిసింది. దీంతో ఇక థియేటర్లలోకి పెద్ద సినిమాలు క్యూ కట్టే అవకాశముంది. అదే సమయంలో ఓటీటీల్లోనూ ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తూనే ఉన్నాయి. జులైలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లూ రిలీజవుతున్నాయి.

OTT Movies: జులైలో ఓటీటీలోకి రానున్న సూపర్ హిట్ సినిమాలివే.. లిస్టులో మోస్ట్ అవైటెడ్ సిరీస్ సీక్వెల్ కూడా..
OTT Movies
Basha Shek
|

Updated on: Jun 30, 2024 | 4:53 PM

Share

టీ20 ప్రపంచకప్ ఫీవర్ ముగిసింది. దీంతో ఇక థియేటర్లలోకి పెద్ద సినిమాలు క్యూ కట్టే అవకాశముంది. అదే సమయంలో ఓటీటీల్లోనూ ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తూనే ఉన్నాయి. జులైలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లూ రిలీజవుతున్నాయి. అందులో విజయ్ సేతుపతి వంద కోట్ల మూవీ మహారాజ, అలాగే శర్వానంద్ మనమే వంటి ఆసక్తికర సినిమాలు ఉన్నాయి. ఇక చాలా మంది ఎదురుచూస్తోన్న మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కూడా జూలై నెలలోనే స్ట్రీమింగ్ కు రానుంది. వీటితో పాటు జులైలో వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, సిరీస్ లపై ఒక లుక్కేద్దాం రండి.

మహారాజ

విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ చిత్రం బ్లాక్‍బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇ్పటికే 100కోట్ల రూపాయల కలెక్షన్లన అధిగమించింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టింది. మహారాజ చిత్రం జూలైలోనే నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. జూలై మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రావొచ్చు.

మనమే

శర్వానంద్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మనమే’. జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ జూలై నెలలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍పై మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కకుడా

రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా, షాకిబ్ సలీమ్ మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన ‘కకుడా’ సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి రానుంది. ఈ హారర్ కామెడీ మూవీ జూలై 12వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ కానుంది.

మీర్జాపూర్ సీజన్ 3

ఇక ఓటీటీ ఆడియెన్స్ ఎంతో కాలంఆ ఎదురుచూస్తున్న మీర్జాపూర్ మూడో సీజన్ జులై నెలలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 5 నుంచి సూపర్ హిట్ సిరీస్ సీక్వెల్ స్ట్రీమింగ్ కు రానుంది. మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ కావడంతో మూడో సీజన్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇవి కూడా..

పవన్ సిద్ధు, సోనియా సింగ్ ల శశిమథనం తెలుగు వెబ్ సిరీస్ జూలై 4వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అలాగే వైల్డ్ వైల్డ్ పంజాబ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), మలయాళీ ఫ్రమ్ ఇండియా (సోనీ లివ్) తదితర సినిమాలు, సిరీస్ లు కూడా జులై నెలలోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి.

Note: ఇవి కాక  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ
ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ
72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..
72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..
మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం
మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్
ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది
ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..