OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన 20కు పైగా కొత్త సినిమాలు.. రవితేజ మాస్ జాతరతో సహా..

ఈ శుక్రవారం (నవంబర్ 28) ఒక్క రోజే సుమారు 20 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో రవితేజ మాస్ జాతర కూడా ఉంది. అలాగే పలు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రస్తుతం ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన 20కు పైగా కొత్త సినిమాలు.. రవితేజ మాస్ జాతరతో సహా..
OTT Movies

Updated on: Nov 28, 2025 | 6:50 AM

ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ గురు వారమే (నవంబర్ 27) థియేటర్లలోకి వచ్చేసింది. ఇక శుక్రవారం కూడా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. అయితే వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం శుక్రవారం ఒక్కరోజే 20 వరకు మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5, జాన్వీ కపూర్ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి లాంటి సినిమాలు గురువారం నుంచే స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇక శుక్రవారం నుంచి మాస్ జాతర, ఆర్యన్, ప్రేమిస్తున్నా, శశివదనే, ఆన్ పావమ్ పొల్లతత్తు వంటి సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు ఉన్నాయో తెలుసుకుందాం రండి.

ఆహా ఓటీటీలో

  • ప్రేమిస్తున్నా – తెలుగు సినిమా
  • క్రిస్టినా కథిర్‌వేలన్ – తమిళ మూవీ

నెట్‌ఫ్లిక్స్

ఇవి కూడా చదవండి
  • మాస్ జాతర – తెలుగు సినిమా
  • ఆర్యన్ – తెలుగు డబ్బింగ్ సినిమా
  • లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ – మాండరిన్ సినిమా
  • స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 – తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్
  • సన్నీసంస్కారి కీ తులసి కుమారి – హిందీ సినిమా

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

  • కాంతార 1 – హిందీ డబ్బింగ్ వెర్షన్
  • షీ రైడ్స్ షాట్ గన్ – తెలుగు డబ్బింగ్ సినిమా

 

జియో హాట్‌స్టార్

  • ఆన్ పావమ్ పొల్లతత్తు – తెలుగు డబ్బింగ్ చిత్రం
  • బార్న్ హంగ్రీ – ఇంగ్లిష్ మూవీ

సన్ నెక్స్ట్

  • శశివదనే- తెలుగు సినిమా

జీ5 ఓటీటీలో

  • ద పెట్ డిటెక్టివ్ – తెలుగు డబ్బింగ్ సినిమా
  • రేగాయ్ – తమిళ వెబ్ సిరీస్
  • రక్త బీజ్ – బెంగాలీ సినిమా

లయన్స్ గేట్ ప్లే

  • ప్రీమిటివ్ వార్ – తెలుగు డబ్బింగ్ సినిమా
  • రష్ – ఇంగ్లిష్ సినిమా

బుక్ మై షో ఓటీటీలో

  • 40 ఏకర్స్ – ఇంగ్లిష్ సినిమా
  • ఎలివేషన్ -ఇంగ్లిష్ మూవీ
  • గ్యాబీ డాల్ హౌస్ – ఇంగ్లిష్ సినిమా
  • హాచీ: ఏ డాగ్స్ టేల్ – ఇంగ్లిష్ మూవీ
  • విన్నర్ – ఇంగ్లిష్ సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.