అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన లావణ్య త్రిపాఠి గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది. ఇటలీ వేదికగా వరుణ్, లావణ్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు మెగా వేడుకకు హాజరై నూతన దంపతులను అశీర్వదించారు. పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన లావణ్య ఇక సినిమాలు చేయదని చాలామంది భావించారు. అయితే అభిమానులను అలరించేందుకు మళ్లీ కెమెరా ముందు కొచ్చిందీ అందాల రాక్షసి. 2022లో హ్యాపీ బర్త్ డే అనే ఓ డిఫరెంట్ సినిమాలో చివరిగా కనిపించింది లావణ్య. అలాగే 2023లో పులి మేక అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించింది. జీ5లో రిలీజైన ఈ సిరీస్‌కు మంచి వ్యూస్ వచ్చాయి. దీంతో మరోసారి వెబ్ సిరీస్‌తోనే అలరించేందుకు రెడీ అవుతోంది లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న సిరీస్ ‘మిస్ పర్‌ఫెక్ట్’. బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేత అభిజిత్ చాలా రోజుల తర్వాత మరోసారి లీడ్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్ త్వరలోనే మన ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లావణ్య వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ఖరారు చేయనున్నారు మేకర్స్.
మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఓవర్ క్లీన్ నెస్(ఓసీడీ)తో కలిగిన అమ్మాయి పాత్రలో నటించింది లావణ్య. అలాగే చెఫ్‌గా అభిజిత్ కనిపించాడు. అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోషన్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. టీజర్ చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తోంది. కామెడీ సీన్లు బాగానే పేలాయి. ‘నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టమని లావణ్య చెప్పడం, అదే అసలు ప్రాబ్లమని చెప్పడం, చెఫ్‌గా అభిజిత్ ఇలా అందరి రోల్స్ ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
When perfectionism meets chaos, the love story is sure to be epic!#MissPerfectonHotstar Coming soon only on #DisneyPlusHotstar#HotstarSpecials
@Itslavanya @Abijeet @abhignya_v #VishvakKhanderao @AnnapurnaStdios #SupriyaYarlagadda @adityajavvadi @prashanthvihari… pic.twitter.com/5Ea8xjcoSA— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 11, 2024
Even we would fall for Nandana at first sight 💓#BhaleBhaleMagadivoy pic.twitter.com/XveabsQcr7
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..