Lavanya Tripathi: ఆదివారం వైజాగ్‌కు మెగా కోడలు.. స్థానికులతో కలిసి బీచ్‌ను శుభ్రం చేయనున్న లావణ్య త్రిపాఠి

|

Jan 28, 2024 | 2:02 PM

గతేడాది మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది లావణ్య త్రిపాఠి. పెళ్లి తర్వాత పర్సనల్‌ లైఫ్‌కే ప్రాధాన్యమిచ్చిన ఈ అందాల రాక్షసి మళ్లీ ప్రొఫెషనల్‌ లైఫ్‌లో బిజీగా మారింది. వివాహం అనంతరం లావణ్య త్రిపాఠి..

Lavanya Tripathi: ఆదివారం వైజాగ్‌కు మెగా కోడలు.. స్థానికులతో కలిసి బీచ్‌ను శుభ్రం చేయనున్న  లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi
Follow us on

గతేడాది మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది లావణ్య త్రిపాఠి. పెళ్లి తర్వాత పర్సనల్‌ లైఫ్‌కే ప్రాధాన్యమిచ్చిన ఈ అందాల రాక్షసి మళ్లీ ప్రొఫెషనల్‌ లైఫ్‌లో బిజీగా మారింది. వివాహం అనంతరం లావణ్య త్రిపాఠి నటిస్తోన్న తెలుగు వెబ్‌ సిరీస్‌ మిస్‌ పర్‌ఫెక్ట్‌. ఇందులో క్లీనింగ్‌ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన అమ్మాయి పాత్రలో లావణ్య నటిస్తోంది. బిగ్‌ బాస్‌ విన్నర్‌ అభిజిత్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో ప్రమోషన్స్‌ షురూ చేశారు. అయితే టీజర్స్‌, ట్రైలర్స్‌తో ఆసక్తిని క్రియేట్‌ చేసిన మిస్‌ పరఫెక్ట్‌ టీమ్‌ తమ ప్రమోషన్స్‌ను కూడా వెరైటీగా ప్లాన్‌ చేశారు. నేషనల్ క్లీన్లినెస్‌ డే (జాతీయ పరిశుభ్రతా దినోత్సవం) వేడుకల్లో భాగంగా ఆదివారం (జనవరి 28) విశాఖపట్నంలో బీచ్‌ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి కూడా పాల్గొననుంది. ఉదయం 6గంటలకు వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిసరాలను క్లీన్‌ చేయనున్నారు .లావణ్యతో పాటు హీరో అభిజిత్‌ కూడా ఈ క్లీనింగ్‌ డ్రైవ్‌లో పాల్గొననున్నాడు. ఈ ప్రోగ్రామ్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మిస్‌ పర్‌ఫెక్ట్‌ టీమ్‌తో పాటు డిస్నీప్లస్‌ హాట్‌స్టార్ కోరింది.

వెరైటీగా ప్రమోషన్లు..

మిస్‌ పర్‌ఫెక్ట్‌ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా లావణ్య.. ఈ మధ్యే ప్రొ కబడ్డీ లీగ్ పోటీలకు కూడా హాజరైంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లకు వెళ్లిన ఈ అందాల తార అక్కడ తెలుగు టైటాన్స్ ను ఎంకరేజ్‌ చేసింది. మొత్తానికి తన మిస్‌ పర్‌ఫెక్ట్‌ సిరీస్‌ను బాగానే జనాల్లోకి తీసుకెళుతోంది మెగా కోడలు. మిస్‌ పర్‌ఫెక్ట్‌ వెబ్‌ సిరీస్‍కు స్కైలాబ్ మూవీ ఫేమ్ విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు. అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్ధన్, మహేశ్ విట్టా, హర్ష్ రోహన్ కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‍ను నిర్మించడం విశేషం. ప్రశాంత్ వి విహారీ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మిస్ పర్ ఫెక్ట్ టీజర్ లో మెగా కోడలు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..