OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఐఎమ్‌డీబీలో ఏకంగా 9.0 రేటింగ్

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. అందులో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చాలా స్పెషల్. నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కిన ఈ మూవీకి ఐఎమ్ డీబీలో ఏకంగా 9.0 రేటింగ్ రావడం విశేషం.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఐఎమ్‌డీబీలో ఏకంగా 9.0 రేటింగ్
OTT Movie

Updated on: Jul 18, 2025 | 1:45 PM

ఓటీటీ ఆడియెన్స్ ను థ్రిల్‌ చేసేందుకు మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీగానే వసూళ్లు వచ్చాయి. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఐఎండీబీ కూడా ఈ మూవీకి ఏకంగా 9.0 రేటింగ్ ఇవ్వడం విశేషం. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ మొత్తం ఒక రాత్రి లో జరిగే స్టోరీ. ఆరుగురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వీరు ఓ రాత్రి పార్టీ అంటూ పీకలదాకా తాగుతారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు అనూహ్యంగా మారిపోతాయి. ఓ ఊహించని ఘటన అందరినీ ఇబ్బందుల్లోకి నెడుతోంది. దీంతో వాళ్లు ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు. మరి అసలు ఏం జరిగింది? ఆ ఆరుగురి జీవితాలు ఏమయ్యాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే

ఈ సినిమా పేరు మనిదర్గల్. అంటే మనుషులు అని అర్థం. రామ్ ఇంద్ర తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కపిల్ వేలవన్, దక్ష లీడ్ రోల్స్ లో నటించారు. వీళ్లే కాకుండా గుణవంతన్ ధనపాల్, అర్జున్‌దేవ్ శరవణన్, సాంబ శివమ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఈ మూవీ గురువారం (జులై 17) అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి వచ్చేసింది.
ఆహా తమిళ్ తో పాటు సన్ నెక్ట్స్ లో కూడా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి కేవలం తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

ఆహాతో పాటు సన్ నెక్ట్స్ లోనూ స్ట్రీమింగ్..

ఒక్క తప్పటడుగుతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.