Regina OTT: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన లేటెస్ట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘రెజీనా’ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు నటించిన రాజరాజ చోర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కోలీవుడ్‌ హీరోయిన్‌ సునైనా. కెరీర్‌ ప్రారంభంలో టెన్త్ క్లాస్‌ వంటి, సమ్‌ థింగ్‌ స్పెషల్‌ వంటి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తమిళ్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది

Regina OTT: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన లేటెస్ట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. 'రెజీనా' మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Regina Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 25, 2023 | 4:15 PM

శ్రీ విష్ణు నటించిన రాజరాజ చోర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కోలీవుడ్‌ హీరోయిన్‌ సునైనా. కెరీర్‌ ప్రారంభంలో టెన్త్ క్లాస్‌ వంటి, సమ్‌ థింగ్‌ స్పెషల్‌ వంటి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తమిళ్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తాజాగా సునైనా నటించిన చిత్రం రెజీనా. డొమిన్ డిసిల్వా తెరకెక్కించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలో అనంత్‌నాగ్‌, వివేక్‌ ప్రసన్న, నివాస్ ఆదితన్ కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 23న థియేటర్లలో విడుదలైన రెజీనా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. బ్యాంక్‌ దోపిడీ నేపథ్యంలో ఒక యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్న ఆసక్తికర కథనంలో ఈ సినిమాను రూపొందించారు. పూర్తి యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన రెజీనా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎప్పటిలాగే సునైనా నటన హైలెట్‌గా నిలిచింది. మరి థియేటర్లలో పెద్దగా ఆడని రెజీనా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అది కూడా రెండు ప్లాట్‌ఫామ్స్‌లో. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ రెజీనా స్ట్రీమింగ్ అవుతోంది.

కాగా తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ రెజీనా సినిమా అందుబాటులో ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. ప్రస్తుతం తమిళ్‌లో మాత్రమే రెజీనా సినిమా అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్‌ కూడా రిలీజ్‌ కావొచ్చని తెలుస్తోంది. ఎల్లో బేర్ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై సతీష్ నాయర్‌ రెజీనా సినిమాను నిర్మించారు. ఆయనే స్వరాలు కూడా సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!