
దీపావళి పండగ సందర్భంగా ఓటీటీలోకి చాలా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయితే ఇప్పుడు మీ ముందుకు ఆద్యంతం ఆసక్తిని కలిగించే సినిమాను తీసుకువచ్చాంమ. ఇంతకీ ఈ మూవీ ఏంటో తెలుసా..? ఆ సినిమాలో మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అదే మిరాజ్. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లలో రారాజుగా పేరుగాంచిన ‘దృశ్యం’ దర్శకుడు జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ‘మిరాజ్’లో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, సంపత్ తదితరులు నటించారు. సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఈ చిత్రాన్ని అటు తెలుగు, తమిళంలోనూ చూడొచ్చు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కిరణ్ (హకీం షాజహాన్) రైలులో ప్రయాణిస్తుంటాడు. అయితే ఆ రైలు ప్రమాదానికి గురవుతుంది. దీంతో ఆ ఘటనలో అతడు మరణించాడని వార్తలు వస్తాయి. అయితే అతడు ఉన్న కంపెనీ రహస్యాలు ఉన్న హార్డ్ డిస్క్ కోసం కంపెనీ అధికారులు, పోలీసులు వెతుకుతుంటారు. ఇందుకోసం కిరణ్ స్నేహితురాలు అభిరామి (అపర్ణ బాలమురళి) వెంటపడతారు. ఇంతలో, అశ్విన్ కుమార్ (ఆసిఫ్ అలీ) ఎంట్రీ ఇస్తాడు. యూట్యూబ్‌లో న్యూస్ ఛానల్ నడుపుతున్న ఆసిఫ్ అలీ, అభిరామికి సహాయం చేయడానికి ముందుకొస్తాడు. చివరికి హార్డ్ డిస్క్ ఎవరికి లభించింది? అందులో ఏముంది? కిరణ్ మరణం నిజమేనా? అనేది మిరాజ్ స్టోరీ.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ప్రస్తుతం ఈ సినిమా సోనీలివ్ ఓటీటీలో చూడొచ్చు. ప్రారంభంలో సాఫీగా సాగిన ఈ సినిమా… ఆ తర్వాత ఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రతి ట్విస్ట్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మిమ్మల్ని సినిమా చివరి వరకు చూసేలా చేస్తుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు సాగి, క్లైమాక్స్‌లో మరింత ఆసక్తి పెంచుతుంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..