
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈ జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. దృశ్యం, HIT, మిడ్ నైట్ మర్డర్స్, ఇత్తెఫాక్ వంటి చిత్రాలు ఓటీటీలో టాప్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ జానర్ లోనే అడియన్స్ మరింత ఇష్టపడేలా చేసే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఓటీటీలో సెన్సేషన్ అవుతున్న ఓ సినిమా గురించి మాట్లాడుకుందాం. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 2 గంటల 43 నిమిషాలు ఉండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సినిమాలోని మలుపులు ఆద్యంతం మీకు భయాన్ని కలిగిస్తుంటాయి. ఇక క్లైమాక్స్ మాత్రం మీ మనసులను తాకుతుంది. ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న సినిమా ఇదే. ఇంతకీ ఈ చిత్రం ఏంటో తెలుసా.. ? అదే మలయాళీ సూపర్ హిట్ తుడరుమ్.
మలయాళంలో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో మోహల్ లాల్, శోభన ప్రధాన పాత్రలు పోషించగా.. ప్రకాష్ వర్మ, మణియంపిల్ల రాజు, భారతీరాజా కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే.. బెంజమిన్ అలియాస్ బెంజ్ ఒక సాధారణ టాక్సీ డ్రైవర్. అందరితోనూ స్నేహంగా ఉంటాడు. అయితే అతడి కారు అనుకోకుండా ప్రమాదానికి గురవుతుంది. దీంతో తన కారును సర్వీసింగ్ కోసం ఇవ్వగా.. ఒక మెకానిక్ దానిని తప్పుడు తప్పుడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాడు. ఆ తర్వాత పోలీసులు ఓ కేసు విషయంలో ఆ కారును స్వాధీనం చేసుకుంటారు. తన కారును కాపాడుకోవడానికి బెంజమిన్ ఊహించని పని చేస్తాడు. షాకింగ్ మలుపులు, ఊహించని సీన్లతో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ చిత్రం.
ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. టాప్ 10లో మూడవ స్థానంలో నిలిచింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 234 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఈ మలయాళ భాషా చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఇది IMDbలో 7.8 రేటింగ్‌ను పొందింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..