రాజావారు రాణివారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు హీరో కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు.. ఈ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ ఆ తర్వాత మాత్రం సరైన హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పటివరకు కిరణ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయాయి. ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన లేటేస్ట్ సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి కథానాయికగా నటించింది. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా నవంబర్ 30న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమ్మోహనుడా సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. కానీ థియేర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో రూల్స్ రంజన్ విఫలమయ్యింది. ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
రోటిన్ లవ్ స్టోరీ కావడం.. ఆశించిన స్థాయిలో కామెడీ లేకపోవడంతో ఈ మూవీ డిజాస్టర్ అయినట్లు తెలుస్తోంది. కానీ నటనపరంగా మరోసారి కిరణ్, నేహాశెట్టిలు ప్రశంసలు అందుకున్నారు. అయితే థియేట్రీకల్ రన్ తర్వాత దాదాపు రెండు నెలలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చింది ఈ సినిమా.
Rules tho kabadi adataniki vachesadu mana Rules Ranjann.
Watch #RulesRanjann on aha now ▶️https://t.co/MYQBHhyLzq pic.twitter.com/y1k2Ld4C8s
— ahavideoin (@ahavideoIN) November 30, 2023
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సుబ్బరాజు, హర్ష చెముడు, హైపర్ ఆది కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. దాదాపు నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ తో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ కోటిన్నర వసూలు చేసింది.
Vote for a better Rule!👍 #TelanganaElections pic.twitter.com/NXS5ihOZcL
— ahavideoin (@ahavideoIN) November 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.