యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ చిత్రం సమ్మతమే (Sammathame). డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా జూన్ 24న విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. తాజాగా ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో సమ్మతమే సినిమా జూలై 15 శుక్రవారం రాత్రి 12 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది ఆహా. కథ విషయానికి వస్తే.. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన ఓ కుర్రాడు పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా ఉంటాడు. ప్రేమకు దూరంగా ఉంటూ పెళ్లి తర్వాతే ప్రేమ అనేలా పెరుగుతాడు. అలాంటి కుర్రాడికి శాన్వి (చాందిని చౌదరి) పరిచయం కావడం..తాను కోరుకున్న లక్షణాలు ఒక్కటి కూడా లేని శాన్వితో అతని ప్రయాణం ఎలా సాగుతుంది ?.. పెళ్లికి ముందు ప్రేమించను అనే కృష్ణ ప్రేమలో పడడం ? చివరకు వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది సమ్మతమే కథ.
Krishnudi leelalu, Sathyabhama alakalu kathale vinamu ipativaraku kani ade role reverse aithe?#SammathameOnAHA premieres July 15.@Kiran_Abbavaram @iChandiniC #GopinathReddy #DivyaSree pic.twitter.com/DQ4v2zlCha
— ahavideoin (@ahavideoIN) July 6, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.