Siren OTT: డైరెక్టుగా ఓటీటీలో ‘సైరన్’ తెలుగు వెర్షన్.. కీర్తి సురేశ్, జయం రవిల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

|

Apr 10, 2024 | 4:16 PM

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. మరో మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ సెకెండ్ హీరోయిన్ గా మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్‌ తెరకెక్కించిన ఈ సినిమాను...

Siren OTT: డైరెక్టుగా ఓటీటీలో సైరన్ తెలుగు వెర్షన్.. కీర్తి సురేశ్, జయం రవిల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Siren Movie
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. మరో మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ సెకెండ్ హీరోయిన్ గా మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్‌ తెరకెక్కించిన ఈ సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలనుకున్నారు కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదంటూ తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. రోటీన్ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. అందుకేనేమో థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేయాలనుకున్న ఆలోచనను కూడా విరమించుకున్నారు. అయితే ఇప్పుడు సైరన్ సినిమాను తెలుగులో డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19 నుంచి సైరన్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్‌ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి తెరకెక్కించిన సైరన్ సినిమాలో ప్రముఖ నటీనటులు ఉన్నారు.
సముద్రఖని, యోగిబాబు, అజయ్, యువినా పార్థవి, తులసి, పాండియన్, అళగం పెరుమాల్ తదితరులు ఈ సినిమాలో వివిధ పాత్రల్లో నటించి మెప్పించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, సామ్ పీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. త‌న భార్య (అనుపమా పరమేశ్వరన్) మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు రాజకీయ నాయకులపై ఓ ఖైదీ (జయం రవి) ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌న్న‌దే సైరన్ సినిమా. ఇందులో కీర్తి సురేశ్‌ పవర్ ఫుల్ పోలీస్ ఇన్‌ స్పెక్టర్ పాత్రలో నటించింది.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

 

సైరన్ సినిమాలో కీర్తి సురేశ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.