OTT Movie: నిధి కోసం అన్వేషణ.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో అడ్వెంచర్‌ థ్రిల్లర్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం

నిధి అన్వేషణ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. అడ్వెంచర్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలను చూసేందుకు చాలా మంది ఆడియెన్స్ ఇష్టపడతారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

OTT Movie: నిధి కోసం అన్వేషణ.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో అడ్వెంచర్‌ థ్రిల్లర్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం
OTT Movie

Updated on: Nov 06, 2025 | 10:05 PM

గతవారం ఓటీటీలోకి వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు 8.6/10 రేటింగ్ దక్కడం విశేషం. 1500 ఏళ్ల కిందటి రాజవంశానికి చెందిన నిధి వేట అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ సాగుతుంది. కదంబరాజుల కాలానికీ .. 1990ల నాటి కాలానికి మధ్యలో నడిచే ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. క థ విషయానికొస్తే, దట్టమైన అడవీ ప్రాంతాన్ని ఆనుకుని మారిగల్లు అనే ఓ కుగ్రామం ఉంటుంది. అక్కడి ప్రజలు మారి అనే దేవత పట్ల పూర్తి విశ్వాసంతో ఉంటారు. అదే  గ్రామంలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే మాస్టర్, ప్రాచీన శిలాఫలకాలను రహస్యంగా సేకరిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి అప్పు కోసం వచ్చిన ‘వరద’ కంట ఆ ప్రాచీన శాసనాలు పడతాయి. అందులోకి ఒక శాసనాన్ని అతను తీసుకుని వెళ్లి, పురావస్తు శాఖకి చెందిన అధికారి ముందు ఉంచుతాడు. అది కదంబరాజుల కాలంలో దాచబడిన నిధి తాలూకు శాసనమని అతనికి అర్థమవుతుంది. మరి ఆ అధికారి ఏం చేస్తాడు? తర్వాత ఏం జరిగింది? నిధి కోసం ఎవరెవరు ఏయే ప్రయత్నాలు చేశారు? చివరికి నిధి దొరికిందా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఈ కన్నడ వెబ్ సిరీస్ పేరు మారిగల్లు. దివంగత సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వనీ పునీత్ రాజ్ కుమార్  ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం.  దేవరాజ్ పూజారి తెరకెక్కించిన ఈ సిరీస్ లో ఏఐ సహాయంతో పునీత్ ను మళ్లీ చూపించగలిగారు. దీంతో ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనికి తోడు ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.  ప్రస్తుతం జీ5 ఓటీటీలో   6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

 

 

జీ5 ఓటీటీలో మారిగల్లు వెబ్ సిరీస్.. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కు ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.