OTT Movie: మరికాసేపట్లో ఓటీటీలోకి కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 27) కూడా ఓటీటీల్లో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన ఇంట్రెస్టింగ్ సినిమాలు, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.

OTT Movie: మరికాసేపట్లో ఓటీటీలోకి కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
OTT Movie

Updated on: Feb 27, 2025 | 2:45 PM

కేజీఎఫ్, కాంతార వంటి సినిమాలతో కన్నడ సినిమాకు కూడా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అక్కడి సినిమాలు వివిధ భాషల్లోనూ రిలీజై ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగా తెలుగు, హిందీ ఇతర వెర్షన్లలోనూ కన్నడ సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ఓ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అదే కౌసల్యా సుప్రజా రామ. 2023లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. ఇప్పుడీ కౌసల్య సుప్రజ రామా సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి కౌసల్య సుప్రజ రామా సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించింది.అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కానుందన్న మాట.

శశాంక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కౌసల్య సుప్రజా రామా సినిమాలో డార్లింగ్‌ కృష్ణ, బృందా ఆచార్య, మిలనా నాగరాజ్‌, అచ్యుత్ కుమార్, రంగాయన రఘు, సుధా బేల్ వాడీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కౌరవ ప్రొడక్షన్ హౌస్, శశాంత్ సినిమా బ్యానర్లపై శశాంక్, బీసీ పాటిల్, యదునందన్ ఈ సినిమాను నిర్మించారు. అర్జున్ జన్యా సంగీతం అందించారు. ఈ సినిమాలో అద్భుత నటనకూ గాను ఉత్తమ సహాయనటిగా సుధా బెలవాడి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈటీవీ విన్ లో కౌసల్య సుప్రజ రామా స్ట్రీమింగ్..

ఆకట్టుకుంటోన్న తెలుగు వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.