Emergency OTT: ఓటీటీలోకి ‘ఎమర్జెన్సీ’ సినిమా.. అధికారికంగా ప్రకటించిన కంగనా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Feb 21, 2025 | 1:01 PM

బాలీవుడ్ ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ'. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు కంగనా. రిలీజ్ కు ముందే ఎన్నో వివాదాలు ఈ సినిమాను చుట్టు ముట్టాయి.

Emergency OTT: ఓటీటీలోకి ఎమర్జెన్సీ సినిమా.. అధికారికంగా ప్రకటించిన కంగనా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Emergency Movie
Follow us on

కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. రిలీజ్ కు ముందే ఈ సినిమాను ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి. దీంతో పలు సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ కుదరలేదు. అయితే ఎట్టకేలకు జనవరి 17న ఎమర్జెన్సీ సినిమా థియేటర్లలో విడుదలైంది. కానీ మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కంగనా సినిమా కొన్ని చోట్ల బాగానే ఆడినా మరికొన్ని చోట్ల జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. రూ.60 కోట్లతో ఎమర్జెన్సీ సినిమాను రూపొందించగా.. రూ.21 కోట్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు తెలిపారు. అయితే ఇందిరా గాంధీ పాత్రలో కంగనా ఆహర్యం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే అంతో ఇంతో సినిమాకు కాస్త కలెక్షన్లను తెచ్చిపెట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను నిరాశ పర్చిన ఎమర్జెన్సీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. కంగనా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముక ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది .ఈ నేపథ్యంలో మార్చి 17 నుంచి ఎమర్జెన్సీ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కంగనా.

కాగా ఎమర్జెన్సీ సినిమా హిందీలో మాత్రమే విడుదలైంది. అయితే ప్రస్తుతం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలన్నీ ప్రధాన భాషల్లోనూ విడుదలవుతున్నాయి. కాబట్టి ఎమర్జెన్సీ సినిమా కూడా తెలుగులోకి స్ట్రీమింగ్ వచ్చే అవకాశముంది. ఎమర్జెన్సీ సిఇనమాలో ఇందిరాగాంధీగా కంగనా నటించడంతో నిర్మాణ, దర్శకత్వం బాధ్యతలను కూడా చూసుకుంది.ఇక జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు. వీరితో పాటు మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు

ఇవి కూడా చదవండి

మార్చి 17 నుంచి స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.